ఈ ప‌వ‌ర్ ఫుల్ ఆయిల్‌ను వాడితే జుట్టు రాల‌డం, చుండ్రు అన్నీ ప‌రార్‌!

ఒత్తైన మరియు ఆరోగ్యమైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు.కానీ వాతావరణంలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పోషకాలు కొర‌త‌, మనం చేసే పలు పొరపాట్లు తదితర కారణాల వల్ల జుట్టు రాలడం, చిట్ల‌డం, విరిగిపోవడం, చుండ్రు వంటి సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు.

 Hair Fall And Dandruff Can Be Reduced By Using This Powerful Oil Details! Hair F-TeluguStop.com

ఈ క్రమంలోనే వాటి నుంచి బయట పడడం కోసం మార్కెట్లో ల‌భ్యం అయ్యే రకరకాల ఖరీదైన హెయిర్ ఆయిల్స్ ను వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంత ఉప‌యోగం ఉంటుందో ప‌క్క‌న పెడితే.

ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ పవర్ ఫుల్ హెయిర్ ఆయిల్ ను వాడితే మాత్రం ఎన్నో జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ హెయిర్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందు రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకుని తొక్క తొలగించి సన్నగా తురుముకోవాలి.

అలాగే మిక్సీ జార్‌లో రెండు టేబుల్ స్పూన్ల లవంగాలు వేసి మెత్త‌టి పొడిలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్ప సన్ ఫ్లవర్ ఆయిల్ ను వేసుకోవాలి.

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో లవంగాల పొడి మరియు అల్లం తురుము వేసుకుని చిన్న మంటపై పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

Telugu Dandruff, Ginger, Care, Care Tips, Fall, Oil, Latest, Powerful Oil-Telugu

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్‌ను స్టైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.

ఆయిల్ పూర్తిగా చల్లారిన అనంతరం ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను నైట్ నిద్రించే ముందు త‌ల‌తో పాటు జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల‌ వరకు పట్టించి బాగా మసాజ్ చేసుకుని పడుకోవాలి.

నెక్స్ట్ డే మార్నింగ్ మైల్డ్ షాంపూ యూస్ చేసి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు కనుక చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

చుండ్రు సమస్య పోతుంది.కురులు ఒత్తుగా మరియు పొడవుగా ఎదుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube