శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.శిలగాంలో భారీ సంఖ్యలో కోతులు మృత్యువాత పడ్డాయి.
గ్రామ సమీపంలోని ఓ తోటలో వానరాలు మృతిచెందాయి.సుమారు 40 వరకు కోతులు చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు.
అయితే వీటిపై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
వానరాలు మృతికి గల కారణాలను తెలుసుకునే నేపథ్యంలో శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు.







