తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది.
ఇక తెలుగులో కూడా ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించిందని చెప్పాలి.ఇక సీజన్ 8 కార్యక్రమంలో భాగంగా సీరియల్ నటుడు నిఖిల్( Nikhil ) విజేతగా నిలిచి ట్రోఫీ అందుకున్నారు.
ఇక నిఖిల్ విజేత కావడంతో గౌతమ్ కృష్ణ ( Gautham Krishna ) రన్నర్ గా నిలిచారు.
ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా గ్రాండ్ ఫినాలేను జరుపుకుంది.ఇక ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు వారి సినిమాల ప్రమోషన్ల నిమిత్తం బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) హాజరయ్యారు.
ఇలా రాంచరణ్ చేతుల మీదుగా విజేత నిఖిల్ ట్రోఫీ అందుకున్నారు.
ఇలా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ముగిసింది అయితే తాజాగా ఈ కార్యక్రమం భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నట్టు నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.స్టార్ మా ఛానెల్‍తో పాటు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో రికార్డు వ్యూస్ వచ్చాయి.ఈ విషయాన్ని బిగ్‍బాస్ తెలుగు హోస్ట్, కింగ్ నాగార్జున వెల్లడించారు.టీవీల్లో ఈ గ్రాండ్ ఫినాలేను 23 మిలియన్ (2.3 కోట్లు) మంది ప్రేక్షకులు చూశారు.డిజిటల్ ప్లాట్‍ఫామ్‍లో ఈ ఫినాలేకు 2 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ వచ్చాయి.ఇలా ఈ స్థాయిలో వ్యూస్ రావడంతో మ్యాసివ్ ఫెనామిన్ అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాగార్జున( Nagarjuna ) .అయితే సీజన్ సెవెన్ తో పోలిస్తే ఎయిట్ కాస్త రేటింగ్ తగ్గిందనే చెప్పాలి.ఈ సీజన్ ప్రసార సమయంలో కాస్త వ్యూస్ అటు ఇటు వచ్చినప్పటికీ గ్రాండ్ ఫినాలే మాత్రం భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోవటం విశేషం.