కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ( Kiccha Sudeep )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సుదీప్ ప్రస్తుతం ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు సుదీప్.అందులో భాగంగానే తాజాగా మ్యాక్స్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఘన విజయం సాధించింది.సినిమా విడుదలైన మొదటి రోజే దాదాపుగా 8.50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషలో( Telugu and Kannada language ) సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు ఆదరణ దక్కుతోంది.కాగా ఈ ఏడాది తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన కన్నడ చిత్రంగా మ్యాక్స్ నిలిచింది.
అయితే ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మాక్స్ సినిమా ( Max movie )విజయోత్సవ వేడుక జరిగింది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారందరికీ ఫోన్ చేసి బయటి ప్రపంచంలో జరిగే పెద్ద వార్తల గురించి చెప్పాలని మ్యాక్స్ సినిమా విడుదలై భారీ కలెక్షన్లు రాబడుతూ పాపులారిటీ సంపాదించుకుందని చెప్పారు.
ఆ తర్వాత రాష్ట్రం నలుమూలల నుంచి మ్యాక్స్ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్న వీడియోలను చూపించారు.ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఒక ప్రత్యేక కేక్ ను పంపారు.కంటెస్టెంట్స్ అందరూ కలిసి కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా హౌస్ మేట్స్ అందరూ బిగ్ బాస్, సుదీప్ లకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.ఇక సుదీప్ స్క్రీన్ పై కనిపించగానే కంటెస్టెంట్స్ అందరూ శుభాకాంక్షలు తెలిపారు.రెండేళ్ల శ్రమ కు తగిన ఫలితం దొరికిందని ఉద్వేగంగా మాట్లాడారు.
ఇక తన మ్యాక్స్ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి మా అమ్మ ఆశీర్వాదం కూడా కారణమని సుదీప్ స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా కొన్ని రోజుల క్రితమే కన్నుమూసిన తన తల్లిని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడీ స్టార్ హీరో.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.