ఐఐఎంలో చదువుకున్న ఒక సక్సెస్‌ఫుల్ స్టార్టప్ ఫౌండర్ మిలింద్ చాంద్వానీ ( Milind Chandwani )రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు.అది ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.
బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి క్యాబ్‌లో వెళ్తుంటే ఆయనకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది.ఆ సంఘటనకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు అందరినీ పగలబడి నవ్వేలా చేస్తోంది.
అసలేం జరిగిందంటే.
మిలింద్ బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ ( Cab driver )విపరీతమైన నిద్ర మత్తులో ఉన్నాడు.
కనీసం కళ్లు కూడా తెరవలేని స్థితిలో ఉన్నాడు.మేల్కోవడానికి టీలు, సిగరెట్లు ఎన్ని తాగినా ఫలితం లేకపోయింది.
దీంతో మిలింద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.తన ప్రాణాలకు రిస్క్ అని గ్రహించి, తానే డ్రైవ్ చేస్తానని డ్రైవర్‌కు చెప్పాడు.
ట్విస్ట్ ఏంటంటే, డ్రైవర్ ఏమాత్రం ఆలోచించకుండా కారు తాళాలు మిలింద్‌కు ఇచ్చేశాడు.
అలా తెల్లవారుజామున 3 గంటలకు మిలింద్ డ్రైవర్ సీట్‌లో కారు నడపడం ప్రారంభించగా అసలు డ్రైవర్ ప్యాసింజర్ సీట్‌లో హాయిగా నిద్రపోయాడు. గూగుల్ మ్యాప్స్ ( Google Maps )పెట్టుకుని మిలింద్ బెంగళూరు రోడ్ల మీద డ్రైవింగ్ చేశాడు.“డ్రైవర్ సీటు వెనక్కి వాల్చి నిద్రపోయాడు, నన్ను డ్రైవ్ చేయమని వదిలేశాడు” అంటూ మిలింద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.సినిమా సీన్‌ను తలపించే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
అంతేకాదు, వారు ఇంటికి చేరుకునే కొద్దిసేపటి ముందు డ్రైవర్ కు బాస్ నుంచి కాల్ వచ్చింది.ఇకపై నైట్ షిఫ్ట్స్ చేయలేనని, డే షిఫ్ట్ ఇవ్వమని డ్రైవర్ తన బాస్‌ను అడుగుతుండటం మిలింద్ విన్నాడు.ఈ వీడియోకు సోషల్ మీడియాలో 13.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మిలింద్ మానవత్వాన్ని కొందరు మెచ్చుకుంటే, డ్రైవర్ నిర్లక్ష్యాన్ని మరికొందరు విమర్శిస్తున్నారు.డ్రైవర్ కే డ్రైవర్ గా మారిన నువ్వు నిజంగా దేవుడు స్వామి అని కొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
అలాగే ఈ ఘటనతో ఓవర్‌టైమ్ డ్యూటీల వల్ల డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు, రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో మరోసారి చర్చకు వచ్చింది.