సోదరి కళ్ల ముందే తమ్ముడు అదృశ్యం.. వీడియో వైరల్

ప్రకృతి ప్రకోపం ఎప్పుడూ చెబుతూ రాదు.ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ఎదురవ్వొచ్చు.

 3-year-old Boy In Indonesia Swept Away After Falling Into Drain Video Viral Deta-TeluguStop.com

ఈ అనిశ్చితి కారణంగా, చాలామంది ప్రజలు ప్రమాదాల భయంతో తమ ఇళ్లను వదిలి వేరే నగరాలు లేదా దేశాలకు వెళ్లేందుకు ప్రయాణిస్తుంటారు.అయితే, కొన్ని సందర్భాల్లో ఇల్లు వదిలిపోకుండా నిత్య కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా ప్రాణాంతక ప్రమాదాలు సంభవిస్తాయి.

అలాంటి హృదయాన్ని కదిలించే ఘటనల వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతుంటాయి.ఇటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా( Viral Video ) మారి అందరి గుండెలను కదిలిస్తోంది.

ఈ హృదయవిదారక ఘటన ఇండోనేషియాలో( Indonesia ) చోటుచేసుకుందని తెలుస్తోంది.వైరల్ గా మారిన వీడియోలో ఒక కాలనీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఉంది.ఇందులో ఒక అమ్మాయి, చిన్న పిల్లవాడు కనిపిస్తారు.ఆ తర్వాత మరో చిన్నారి( Boy ) వస్తాడు.అమ్మాయి వర్షపు ప్రవాహం వైపు చూపిస్తుంది.అయితే చిన్న పిల్లవాడు ఆ ప్రవాహానికి( Flood ) దగ్గరగా వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతాడు.

ప్రమాదం జరిగాక, ఆ అమ్మాయికి అసలు ఏం జరిగిందో తెలియకపోవడం ఆశ్చర్యకరం కలిగిస్తుంది.మరొక పిల్లవాడు వెనుక నుంచి ఏడుస్తూ వచ్చి ఆ అమ్మాయికి ఈ విషయాన్ని అర్థం అయ్యేలా చెబుతాడు.

ఆ తరువాత, ఇద్దరూ ఆ స్థలం నుంచి పరుగెత్తి వెళ్తారు.

ఈ వీడియో చూసిన వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది ఈ ప్రమాదానికి పిల్లల తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని కారణంగా చెబుతున్నారు.భారీ వర్షంలో పిల్లలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరికొంతమంది వినియోగదారులు నీటిలో మునిగిపోయిన చిన్నారికి ఏమైందని ప్రశ్నించారు.బాలిక ప్రమాదాన్ని గుర్తించి సరైన చర్య తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినవారూ ఉన్నారు.

ఈ వీడియో వలన తల్లిదండ్రులు, ప్రజలు పిల్లల భద్రతపై మరింత జాగ్రత్త వహించాలని స్పష్టమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube