ఈ ఏడాది ఆషాడ అమావాస్య( Ashada Amavasya ) జూలై 17వ తేదీన వస్తోంది.ఈ రోజు నదీ స్నానం, దానధర్మాలు, పితృ పూజలకు విశేష ప్రాధాన్యత ఉంది.
ఆషాడ అమావాస్య లేదా బీమా అమావాస్య రోజున పుణ్యం కోసం అనేక కార్యాలు నిర్వహిస్తారు.అయితే కొన్ని చేయకూడని పనులపై నిషేధాన్ని విధించారు.
తెలుసో తెలియకో ఆషాడ అమావాస్య రోజు మనల్ని దోషులుగా మార్చే కొన్ని పనులను మనం చేస్తూ ఉంటాము.అమావాస్య రోజు మనం ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆషాడ అమావాస్య రోజు చెట్లు, మొక్కలకు( Planting ) సేవ చేయడానికి, కొత్త వాటిని నాటడానికి అనుకూలమైన రోజు.ఇలా చేయడం వల్ల గ్రహదోషం, పితృ దోషాలు తొలగిపోతాయి.ఈ రోజు మీరు చెట్లకు మొక్కలకు హాని అస్సలు చేయకూడదు.ఒకవేళ తెలుసో తెలియకో మొక్కలకు హాని చేస్తే మీరు గ్రహ దోషం లేదా పితృ దోషానికి( Pithru Dosham ) గురి కావచ్చు.
ఆషాడ అమావాస్య రోజు పూర్వీకుల తృప్తి కోసం తర్పణ పిండాన, శ్రద్ధకర్మ తదితర పూజలు చేస్తారు.ఈరోజు మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్న అది మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించకూడదని గుర్తుపెట్టుకోవాలి.
పూర్వీకుల కోపం కారణంగా మీరు వారి శాపం లో భాగమవుతారు.ఫలితంగా పనిలో వైఫల్యం, ఆస్తి నష్టం, ఆర్థిక సంక్షోభం, సంతాన సంబంధిత సమస్యలు వస్తాయి.ఈ అమావాస్య రోజున కుక్కలు, ఆవులు,కాకులు మొదలైన వాటికి అసలు హాని చేయకూడదు.ముఖ్యంగా వాటికి ఆహారం ఇస్తున్నప్పుడు లేదా ఆహారం కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి హాని చేయకూడదు.
కాకికి ఆహారం తినిపిస్తే పూర్వీకులు ( Ancestors ) ప్రసన్నమవుతారని చాలా మంది ప్రజలు నమ్ముతారు.మీరు ఈ జంతువులను, పక్షులను చంపిన లేదా హాన్ని చేసిన మీ పూర్వికులు ఆగ్రహానికి గురికావచ్చు.