మన దేశంలో ఉన్న గ్రామాలలో కచ్చితంగా ఆంజనేయ స్వామి దేవాలయం( Anjaneya Swamy Temple ) ఉంటుంది.ఎందుకంటే గ్రామానికి రక్షకుడు ఆంజనేయ స్వామి అని దాదాపు చాలా మంది ప్రజలు భావిస్తారు.
ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందేందుకు హనుమాన్ చాలీసా ను చదువుతూ ఉండాలి.హనుమాన్ చాలీసా( Hanuman Chalisa ) చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అన్ని మంత్రాలలో అత్యంత శక్తివంతమైన హనుమాన్ చాలీసా పఠిస్తే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే సక్సెస్, డబ్బు( money ) ఎల్లప్పుడూ మీతో ఉండాలంటే మధ్యాహ్నం సమయంలో హనుమాన్ చాలీసా ను 11 సార్లు చదవడం మంచిదని పండితులు( Scholars ) చెబుతున్నారు.

అంతే కాకుండా గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న వారు హనుమాన్ చాలీసా ను 108 రోజులు 108 సార్లు పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది.అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే బ్రహ్మ ముహూర్త సమయంలో 40 రోజుల పాటు 31 సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.ఇంకా చెప్పాలంటే భయం పోయి మానసికంగా, దృఢంగా ఉండడం కోసం సూర్యాస్తమయం లో 11 సార్లు హనుమాన్ చాలీసా చదవడం మంచిదని చెబుతున్నారు.పీడలు తొలగిపోవాలంటే సాయంత్రం సమయంలో 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుతూ ఇల్లంతా ధూపం వేయడం మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే కోర్టు కేసుల,( Court cases ) ఇబ్బందులు ఉంటే హనుమాన్ చాలీసా ను సాయంత్రం సమయంలో 21సార్లు పఠిస్తే ఆ సమస్యలు త్వరగా దూరం అవుతాయి.అలాగే శత్రు పీడ తొలగిపోవాలంటే నిష్టగా 11 సార్లు రోజు హనుమాన్ చాలీసా ను చదవాలి.కోరుకున్న కెరీర్, జీవితంలో విజయం సాధించాలంటే జీవితాంతం రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా( Hanuman Chalisa ) చదవడం మంచిదని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా పేరు, బంగారు భవిష్యత్తు కోసం నిర్దిష్ట సమయాలలో 21 వేల సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
ఈ నియమాన్ని పాటించాలనుకుంటే ఆంజనేయ స్వామి దేవాలయం లోని పూజారిని సంప్రదించడం మంచిది.