నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసా?

అమ్మవారిని ఆరాధించటానికి అత్యంత పవిత్రమైన రోజులు శరన్నవరాత్రులు.ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు.భక్తులు నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు.ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి.ఏ రకమైన పూజలు చేయాలి? ఏ మంత్రాలు జపించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 How To Worship Goddess Durga In Navarathri ,  Devotional,durgamatha, Goddess Nav-TeluguStop.com

మొదటిరోజు

.మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గా దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు.గృహంలో అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతో పూజ చేయాలి.’ఓం శ్రీ కనకదుర్గా దేవతాయే నమో నమః’ అనే మంత్రంతో అమ్మవారికి ఎర్రటి మందార పూలతో పూజ చేస్తే అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు.రుణబాధల తీవ్రతను తగ్గింపచేసుకోవచ్చు.

రెండో రోజు

.రెండో రోజు బాలా త్రిపురసుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు.

ఈ రోజు ‘భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా అనే మంత్రాన్ని ఏలైనన్ని సార్లు జపించాలి.అమ్మవారికి పసుపు పచ్చటి చామంతి పూలతో పూజించాలి.

మూడో రోజు

.మూడో రోజు గాయత్రీ దేవిగా అమ్మవారు.దర్శనమిస్తారు.ఇంట్లో అమ్మవారి చిత్రపటానికి తెల్లటిపూలతో పూజ చేయాలి.వీలైనన్ని సార్లు ‘గాయత్రి.వ్యాహృతి సంధ్యా నిజబ్బంద నిషేవితో అనే మంత్రాన్నిజపించాలి.ఇలా చేయటం వల్ల గాయత్రీ దేవిఅనుగ్రహంతో జీవితంలో అన్న పానాలకు ఎలాంటి లోటు ఉండదు.

నాలుగో రోజు

.నాలుగో రోజు అన్నపూర్ణా దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు.ఈరోజు అమ్మవారికి తెల్లటి పూలతో పూజ చేయాలి.‘పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరీ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి.ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి సిద్ధిస్తుంది.

Telugu Devotional, Durgamatha, Worshipgoddess-Telugu Bhakthi

అయిదో రోజు

.అయిదో రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు.లలితా అమ్మవారి చిత్రపటం ముందు దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్రాన్నిపారాయణం చేయాలి.లలితా సహస్ర నామాన్ని పూర్తిగా చదవలేని వారు ఇంట్లో లలితా అమ్మవారి చిత్రపటం ముందు కూర్చొని ‘శ్రీ శివశక్యరూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని జపిస్తూ చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే సంవత్సరం మొత్తం లలితా దేవి అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్య ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది.

ఆరో రోజు

.ఆరో రోజు మహాలక్ష్మిగా అమ్మవారు దర్శనమిస్తారు.ఈరోజు’అమ్మవారి చిత్రపటానికి తామర వత్తులతో దీపారాధన చేయాలి.మహాలక్ష్మీ దేవిని మల్లి, జాజి, గులాబీ పూలతో పూజించాలి.ఈరోజు అమ్మవారిని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

ఏడో రోజు

.ఏడో రోజు అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు.ఇంట్లో అమ్మవారి చిత్రపటానికి తెల్లటి పూలతో పూజ చేయాలి.

అలాగే తెలుపు రంగు పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి.

Telugu Devotional, Durgamatha, Worshipgoddess-Telugu Bhakthi

ఎనిమిదో రోజు

.ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు.ఇంట్లో అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి పూలతో పూజ చేయాలి.

అమ్మవారి పటం ముందు నాలుగు వత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.దుర్లభా దుర్గమా దుర్గా దుఖహంత్రి సుఖప్రదా యై నమః’ అనే మంత్రాన్ని జపించాలి.దీని వల్ల నరఘోష, దృష్టి దోషం, అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడొచ్చు.

తొమ్మిదో రోజు

.తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు.ఇంట్లో అమ్మవారి చిత్రపటాన్ని రకరకాల ఎర్రటి పుష్పాలతో పూజించాలి.‘అపర్ణా చండికా చండముండాసుర నిఘాధిని’ అనే మంత్రాన్ని జపిస్తూ గంటని గట్టిగా మోగించాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా దుష్టశక్తులుంటే అవన్నీ తొలగిపోతాయి.

భూత ప్రేత పిశాచ బాధల నుంచి బయట పడతారు.శత్రు బాధలు తొలగుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube