ఈ ఏడాది అధిక శ్రావణమాసం( adhika-sravana-masam ) జులై 18 నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు ఉంటుంది.ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణమాసం ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ఈ అధిక మాసన్నీ శూన్య మాసం అని కూడా అంటారు.జ్యోతిష్య శాస్త్రంలో అధిక శ్రావణమాసం ఉంటే నష్టాలు తప్పవు.
ఈ అధిక శ్రావణమాసం అసాధారణ వర్షపాతం కారణంగా వ్యవసాయానికి నష్టం కలిగిస్తుంది.
శూన్య మాసంగా చెప్పబడే ఈ అధిక మాసం ఎట్టి పరిస్థితులలోనూ మంచిది కాదు.
కొన్ని ప్రాంతాలలో అతివృష్టి కొన్ని ప్రాంతాలలో అనావృష్టితో సంపద నష్టం జరుగుతుంది.ఇప్పటికే భారత దేశంలో ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాలలో వరదల పరిస్థితి ఉంటే బీహార్, జార్ఖండ్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయింది.
కరువుతో బీహార్ రాష్ట్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది.అంతేకాకుండా ఉదయం 5:10 నిమిషాలకు సూర్యుడు( LORD SURYA ) కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఖఫర్ యోగం ఏర్పడుతుంది.

ఈ యోగం వల్ల దేశంలో అనేక సంక్షోభాలు, ప్రభుత్వ సవాళ్లు పెరుగుతాయి.కర్కాటక రాశిలో తొమ్మిదవ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు.ఇది అంగారక మరియు శుక్ర గ్రహాల నుంచి ఈ ప్రభావాలను పొందుతుంది.దీనివల్ల రాబోయే నెలలలో సుప్రీంకోర్టు యొక్క ముఖ్యమైన నిర్ణయాలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు పెను సవాళ్లను సృష్టించే అవకాశం ఉంది.
ఈ యోగం వల్ల ఎక్కువ పిడుగు పాట్లు,హిమాలయాల ప్రాంతాలలో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది.ఉత్తర భారత దేశంలో ప్రాణా నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది.

పార్లమెంట్లో ఒక ప్రధాన చట్టంపై ముఖ్యమైన చర్చలు జరిగే అవకాశం ఉంది.యూనిఫామ్ సివిల్ కోర్టు రాజకీయ గందరగోళం నెలకొనే అవకాశం ఎక్కువగా ఉంది.అధికమాసం ప్రభావంతో రాబోయే 30 రోజుల్లో శని మరియు అంగారక గ్రహాల కలయిక వల్ల కేంద్ర ప్రభుత్వానికి సవాళ్లు ఏర్పడతాయి.మణిపూర్ హింస మరియు ద్రవ్యోల్బణం సమస్య ఇబ్బందినీ కలిగిస్తుంది.
DEVOTIONAL