మజిలీ భామ కెరియర్ మలుపు తిరిగింది

శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్.అన్షు పాత్రలో మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దోచుకుంది.

 Divyansha Kaushik: Superstar In Making ,divyansha Kaushik , Tollywood ,akkineni-TeluguStop.com

ఈ చిత్రానికి అద్భుతమైన రివ్యూలు రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది.దివ్యాంశ కౌశిక్ తన నటనా నైపుణ్యానికి చాలా ప్రశంసలు అందుకుంది.

తరువాత ఆమె సిద్దార్థ్ నటించిన టక్కర్ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మళ్ళీ “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంతో తెలుగు సినిమాకు రీ ఎంట్రీ ఇచ్చింది.

శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రం నుండి ఇదివరకే విడుదలైన సొట్టల బుగ్గల్లో పాటలో రవితేజ సరసన కనిపించిమరోసారి కుర్రకారును ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ చేతినిండా అవకాశాలతో ఈ ఇయర్ కేలండరను తన కాల్షీట్స్ తో నింపేసింది.

కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా తమిళ చిత్రాల అవకాశాలుకూడా దివ్యాంశ ను వెతుక్కుంటూ వస్తున్నాయి.అందం, అభినయం సమపాళ్లలో ఉన్న దివ్యాంశ తన స్పీడ్ పెంచడం అభిమానులకు ఆనందం కలిగించే విషయం.

రవితేజ సరసన దివ్యాంశ నటించిన రామారావు ఆన్ డ్యూటీ జులై 29 న రిలీజ్ కు సిద్ధమవుతుంది.ఈ చిత్రానికి మంచి ఫలితాలు వస్తే ఈమెకు వరుస అవకాశాలు రావడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube