వైసీపీ మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తిరుపతిలో “వైయస్సార్ వాహన మిత్ర” కార్యక్రమంలో పాల్గొన్న రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని చూసి జనం నవ్వుకుంటున్నారని సెటైర్లు వేశారు.
పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్ళకుండా ఇతర పార్టీలకు ఓటు వేయమని చెప్పిన ఒకే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు.రోడ్ల పరిస్థితి పై డిజిటల్ క్యాంపెయిన్ పవన్ కళ్యాణ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
టీడీపీ మరియు బీజేపీ హయాంలో నాసిరకం పనుల వాళ్లే రోడ్లకు ఇటువంటి దుస్థితి ఏర్పడిందని మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ బిజెపిని టిడిపిని ఎందుకు ప్రశ్నించారు.? అంటూ నిలదీశారు.ప్రధాని మోడీ దేశం కోసం అప్పులు చేయడం లేదా.? అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.అప్పులు చేసిన గాని ఆ డబ్బులతో ప్రజలకు ఖర్చు పెడుతున్నారని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఉండి జనంలోకి తిరగని ఒకే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు.
బిజెపితో కలవాల్సిన అవసరం మాకు లేదని కుండ బద్దలు కొట్టారు.అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తామని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.