హిందూ సాంప్రదాయం ప్రకారం జడకు మూడు పాయలే ఎందుకు అల్లుతారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం స్త్రీ జడకు ఎంతో విశిష్టత ఉంది.మన సాంప్రదాయం ప్రకారం స్త్రీలు జడ వేసుకోవడం తప్పనిసరి.

అయితే ప్రస్తుత కాలంలో అమ్మాయిలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడటం వల్ల వివిధ రకాలుగా కట్ చేసుకోవడం చూస్తున్నాము.అదే రెండు తరాల ముందు వారు ఎప్పుడు జడను చక్కగా అల్లుకొని వివిధ రకాల పుష్పాలను పెట్టుకొని, అదేవిధంగా జడకు వివిధ రకాల నగలను అలంకరించుకొని ఎంతో అందంగా ముస్తాబు అయ్యేవారు.

పూర్వకాలంలో చిన్నపిల్లలు రెండు జడలు వేసుకునేవారు.అదేవిధంగా పెళ్లీడుకొచ్చిన యువతులు ఒక జడ వేసుకునేవారు.

అదే పెళ్లి జరిగే సంతానం కలిగిన వారు జడకు ముడివేసే జడ చుట్టూ పువ్వులు పెట్టుకునేవారు.అంతేకానీ అప్పట్లో ఏ స్త్రీ కూడా జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరిగేవారు కాదు.

Advertisement

ఈ విధంగా జుట్టు విరబోసుకుని తిరగడం వల్ల ఇంటికి జేష్టాదేవికి అనుగ్రహం కలుగుతుందని,జేష్టాదేవి ప్రభావం మన ఇంటి పై ఉంటే ఇంటిలో ఎన్నో కష్టాలు కలుగుతాయని చెప్పేవారు.అందుకోసమే స్త్రీలు తలను ఎంతో చక్కగా దువ్వి తల వెంట్రుకలను మూడు పాయలుగా తీసుకొని అల్లుకొనేవారు.

అయితే ఈ విధంగా మూడు పాయాలే ఎందుకు తీసుకొనేవారో ఇక్కడ తెలుసుకుందాం.

అప్పట్లో చిన్న పిల్లలకు జడలు వేసిన, యువతులు జడ వేసుకున్నా,జుట్టుని మూడు పాయలుగా విడదీస. త్రివేణి సంగమంలా కలుపుతూఅల్లేవారు ఈ మూడు పాయలకు కూడా మన హిందూ ధర్మంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి.

* స్త్రీ జడ మూడుపాయలకు తన భర్త,తాను,తన సంతానం అనే అర్థాన్ని సూచిస్తాయి.

*సత్వ, రజ, తమో గుణాలు,*జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అనే అర్థాలు వస్తాయి.ఈ తతంగం స్త్రీలు వేసుకునే జడ బట్టి వారు చిన్న పిల్లలా, లేక అవివాహితుల, పెళ్లి సంతానం కలిగిన వారా అనే విషయాలను ఎంతో సులభంగా కనిపెట్టవచ్చు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు