ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది.ఈ వారంతో ప్రచారం ముగియనుంది.
దీంతో మండుటెండల్లో సైతం ప్రధాన పార్టీల నేతలు బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.2014లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం జరిగింది.అదేవిధంగా ఇప్పుడు కూడా గెలవాలని చంద్రబాబు ప్లాన్.ఈ క్రమంలో కూటమి తరపున భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఒకపక్క చంద్రబాబు మరోపక్క పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లోకేష్.( Lokesh ) వరుస పెట్టి ఎన్నికల సభలలో పాల్గొంటున్నారు.
సోమవారం ప్రధాని మోడీ( PM Modi ) కూటమి తరపున రాజమండ్రి, అనకాపల్లి ప్రాంతాలలో కూటమి నిర్వహించిన సభలలో పాల్గొనడం జరిగింది.ఈ క్రమంలో ప్రచారం చివరి దశకు చేరుకోవటంతో ప్రత్యర్థులపై కూటమి పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
మరోపక్క నేతల మాట తీరు విషయంలో ఎలక్షన్ కమిషన్( Election Commission ) అంతా గమనిస్తూ ఉంది.ఈ క్రమంలో సీఎం జగన్ పై( CM Jagan ) చంద్రబాబు వ్యాఖ్యలు శృతి మించుతున్నాయని ఈసీ హెచ్చరించింది.
సీఎం జగన్ పై వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది.ఇటీవల జగన్ పై చంద్రబాబు మాటల దాడి విపరీతంగా పెంచారని వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో ఈసీ స్పందించడం జరిగింది.