స్టార్స్ ను మించిన ప్రయోగాత్మక పాత్రలో నాని.. ది ప్యారడైజ్ గ్లింప్స్ వేరే లెవెల్!

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ (Nani ,Srikanth Odela combination)లో తెరకెక్కిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

 Natural Star Nani Role In The Paradise Details Inside Goes Viral In Social Medi-TeluguStop.com

ది ప్యారడైజ్ గ్లింప్స్ (The Paradise Glimpse)తాజాగా విడుదల కాగా ఈ గ్లింప్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ గ్లింప్స్ లో నాని లుక్ న భూతో న భవిష్యత్ అనేలా ఉంది.

స్టార్స్ ను మించిన ప్రయోగాత్మక పాత్రలో నాని ఈ సినిమాలో కనిపించనున్నారు.న్యాచురల్ స్టాఅర్ నాని(Natural Star Nani) ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది.

ఈ గ్లింప్స్ కోసమే దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Nani, Natural, Natural Nani, Srikanth Odela-Movie

ఆ లుక్స్ ఏంటి? ఆ కాన్సెప్ట్ ఏంటి? అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.నాని ఫ్యామిలీ హీరో నుంచి వయొలెంట్ హీరోగామారిన కథ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గ్లింప్స్ లో బూతులు కూడా ఉండటంపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పాన్ ఇండియా స్థాయిలో నాని బాక్సాఫీస్ ను షేక్ చేసేలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

Telugu Nani, Natural, Natural Nani, Srikanth Odela-Movie

ది ప్యారడైజ్ మూవీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.2026 సంవత్సరం మార్చి నెల 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.ఈ ఏడాది నాని కేవలం హిట్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నాని పాన్ ఇండియా ఇమేజ్ ను పెంచుకునే దిశగా అడుగులు వేయనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నాని కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube