మీనాక్షి చౌదరి ( Meenakshi Chowdary ) పరిచయం అవసరం లేని పేరు.ఈమె గది కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
మీనాక్షి చౌదరి నటించిన గుంటూరు కారం, గోట్, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలు వరుస సక్సెస్ కావడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది.ప్రస్తుతం వరుస తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ మీనాక్షి చౌదరి ఎంతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా మీనాక్షి చౌదరి గురించి నిన్నటి నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈమెనూ ఏపీ ప్రభుత్వం ( Ap Government )ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్( Brand Ambassador ) గా ఎంపిక చేసిందని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఉత్తర్వులు జారీ చేస్తూ ఈమెను నియమించబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు మాత్రం విమర్శలు చేశారు.

మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన మహిళలు ఉన్నారు వారందరికీ కాకుండా ఇతర రాష్ట్రానికి చెందిన మీనాక్షి చౌదరినీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం ఏంటి అంటూ విమర్శలు కురిపించారు.ఇలా మీనాక్షి చౌదరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంలో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తలని ఖండించింది.మీనాక్షి చౌదరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ ఈ వార్తలను ఖండించారు.
ఇలా మీనాక్షి చౌదరి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని తెలియడంతో ఇలాంటి ఒక ఫేక్ న్యూస్ ద్వారా మీనాక్షి చౌదరి సినిమాలకు కావలసినంత పబ్లిసిటీ వచ్చింది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.







