అమెరికా కేంద్రంగా (America-centered)పనిచేస్తోన్న అతిపెద్ద ప్రవాస భారతీయ వైద్యుల సంఘమైన ‘‘ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(American Association of Physicians of Indian Origin) (ఏఏపీఐ) ’’ 43వ వార్షిక వేడుకలకు సిద్ధమైంది.జూలై 24 నుంచి 27 వరకు ఒహియోలోని సిన్సినాటీలో ఏఏపీఐ 43వ వార్షిక కన్వెన్షన్ , సైంటిఫిక్ అసెంబ్లీని నిర్వహించనున్నట్లుగా తెలిపింది.
రివర్ సెంటర్‌లోని మారియట్ హోటల్‌లో ఈ సమావేశం జరగనుంది.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఒహియో గవర్నర్ మైక్ డివైన్, ఒహియో గవర్నర్ బరిలో నిలిచిన వివేక్ రామస్వామి(Vivek Ramaswamy), అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బాబీ ముక్కామల, పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ నాగేశ్వర రెడ్డి(Dr.
Bobby Mukkamala, Padma Vibhushan awardee Dr.Nageswara Reddy) తదితర ప్రముఖులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఏఏపీఐ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కత్తుల వివరించారు.దాదాపు 1100 మంది భారత సంతితికి చెందిన వైద్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ వార్షిక సమావేశాన్ని ఏఏపీఐ ఒహియో చాప్టర్ నిర్వహిస్తోంది.ఏఏపీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ అమిత్ చక్రవర్తి (Dr.Amit Chakraborty)మాట్లాడుతూ.ఈ ఫోరమ్ విద్యా సంబంధ విషయాలతో పాటు క్లినికల్ పద్ధతుల్లో పురోగతిని అందిస్తుందని చెప్పారు.రాబోయే సంవత్సరానికి అజెండాల రూపకల్పన ఉంటుందని చక్రవర్తి వెల్లడించారు.

ఏఏపీఐ ప్రధాన కార్యాలయం ఇల్లినాయిస్‌లోని ఓక్ బ్రూక్‌లో ఉంది.అమెరికా వ్యాప్తంగా దాదాపు 1,20,000 మంది వైద్యులు, వైద్య విద్యార్ధులతో ఈ సంస్థ అతిపెద్ద సంస్థగా నిలిచింది.అమెరికాలోని మెడికల్ కాలేజీలలో చేరే వైద్య విద్యార్ధులలో దాదాపు 10-12 శాతం మంది భారత సంతతికి చెందిన వారేనని ఏఏపీఐ అంచనా వేసింది.
పెరుగుతున్న వైద్యుల శ్రమశక్తికి మద్ధతుగా నిలవడం, ఊబకాయం నివారణ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో పాల్గొనడం , ప్రపంచ ఆరోగ్య రంగంలో పెట్టుబడులు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడం వంటి వాటిపై ఏఏపీఐ ప్రభావం కనిపిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.







