ప్రపంచ ప్రఖ్యాత 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అట్టహాసంగా జరిగింది.హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక కన్నుల పండుగ జరిగింది.
ప్రపంచ సినీ రంగంలోని అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.రొమాంటిక్ కామెడీ చిత్రం అనోరాకు ఆస్కార్స్ 2025లో అవార్డుల (Oscars 2025 awards )పంట పండింది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో అనోరా అవార్డులను కైవసం చేసుకుంది.అలాగే డ్యూన్ : పార్ట్ 2 చిత్రం .బెస్ట్ సౌండ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది.

భారత్‌కు ఆస్కార్స్‌లో నిరాశే ఎదురైంది.మనదేశం నుంచి నామినేషన్‌లో నిలిచిన అనూజ చిత్రం అవార్డ్ దక్కించలేదు.ఈ విభాగంలో ఐయామ్ నాట్ ఏ రోబో(I am not a robot) సినిమాకు బెస్ట్ షార్ట్ ఫిలింగా అవార్డ్ అందుకుంది.
ఇక ఆస్కార్ రెడ్ కార్పెట్, వేదిక వద్ద పలువురు ముద్దుగుమ్మలు సందడి చేశారు.డీమోల్డెన్ బర్గ్, అరియానా గ్రాండే, డోజా క్యాట్, క్వీన్ లతీఫా, సింథియా (Die Moldenburg, Ariana Grande, Doja Cat, Queen Latifah, Cynthia)ఎరివో తదితర తారలు లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సుల్లో మెరిశారు.

ఇక ఆస్కార్ 2025 వేడుకలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కోనన్ ఓ బ్రెయిన్ .అతిథులకు, ప్రేక్షకులకు హిందీలో నమస్కారం చెబుతూ స్వాగతం పలికారు.ఆస్కార్ ప్రదానోత్సవం భారత్‌లో జియో హాట్ స్టార్‌లో , అమెరికాలో స్టార్ ప్లస్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది వీక్షించారు.
తన కెరీర్‌లో ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించిన ఓ బ్రెయిన్ భారతీయ ప్రేక్షకులతో హిందీలో మాట్లాడి సర్‌ప్రైజ్ చేశారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఓబ్రెయిన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.







