ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలంటే పోషకాహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవడం ఎంత ముఖ్యమో ఒంటికి వ్యాయామం కూడా అంతే ముఖ్యం.వ్యాయామాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.
అయితే వాటిలో కొన్ని మాత్రం మనకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తాయి.సైక్లింగ్( Cycling ) కూడా ఆ కోవకే చెందుతుంది.
నిత్యం 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం వల్ల అదిరిపోయే ఆరోగ్య లాభాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
కేలరీలను బర్న్ చేయడానికి మరియు బరువు తగ్గడానికి( Weight Loss ) సైక్లింగ్ ఒక మంచి వ్యాయామం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అలాగే సైక్లింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు దూరమవుతాయి.మైండ్ షార్ప్ గా పని చేస్తుంది.సైక్లింగ్ గుండె కండరాలను బలపరుస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సైక్లింగ్ మీ దిగువ శరీరంలో మొత్తం పని తీరును పెంచుతుంది.మీ కీళ్లపై ఒత్తిడి లేకుండా మీ కాలు కండరాలను బలపరుస్తుంది.అంతేకాకుండా నిత్యం సైకిల్ చేస్తే మధుమేహం క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ కొందరు మాత్రం సైక్లింగ్ కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల కాలు శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు, మోకాలి నొప్పిలున్న( Knee Pains ) వ్యక్తులు సైక్లింగ్ చేయకూడదు.తీవ్రమైన ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులు, ఉబ్బసం ఉన్న వ్యక్తులు సైక్లింగ్ కు దూరంగా ఉండాలి.గుండె సంబంధిత జబ్బులతో( Heart Diseases ) బాధపడుతున్న వారు సైక్లింగ్ చేయకూడదు.జ్వరం, శరీరం లేదా కండరాల నొప్పులు ఉన్నప్పుడు, నీరసం అలసట వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు, హృదయ స్పందన రేటు పెరిగినప్పుడు కూడా సైక్లింగ్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవే కాకుండా ఇతర ఆరోగ్య పరిస్థితులు ఉన్నా కూడా సైక్లింగ్‌తో సహా ఏదైనా వ్యాయామాన్ని ప్రారంభించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.







