సిలికా జెల్ సంచుల వలన కలిగే ఉపయోగాలు

సిలికా జెల్ సంచులను మనం తరచుగా షూ బాక్సులలో చూస్తూ ఉంటాం.వాటిని పూర్తిగా పనికిరాని మరియు విషపూరితమైనవని చెత్త బుట్టలో పడేస్తాం.

 Unbelievable Uses For Silica Gel Packets-TeluguStop.com

నిజానికి వాటిలో విషం ఉండదు.ఈ సంచులలో సిలికాన్ డయాక్సైడ్ అనే పదార్ధం ఉంటుంది.

ఇది మనకు ఇంటిలో చాలా బాగా ఉపయోగపడుతుంది.అయితే ఇప్పుడు ఆ ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

1.జిమ్ బ్యాగ్ లో ఉంచాలి


అదనపు తేమను గ్రహించటం ఈ సంచుల యొక్క ముఖ్య ఉపయోగం.బాక్టీరియా ఎక్కువగా,తడి మరియు తేమ వాతావరణాలలో వృద్ది చెందుతుంది.అందువల్ల ఇవి జిమ్ బ్యాగ్,ల నుండి నెమ్ము మరియు క్రిములను తొలగించటానికి సహాయపడతాయి.దాంతో జిమ్,బ్యాగ్ లు దుర్వాసన రాకుండా ఉంటాయి.

2.టవల్స్ మధ్య ఉంచాలి


టవల్స్ ఉన్న కేబినేట్ లో సిలికా సంచులను పెడితే తడి మరియు చెత్త వాసనలు,అన్ని పోతాయి.

3.రెజర్ కవర్ లో ఉంచాలి


రేజర్ ఎప్పుడు తడిగానే ఉంటుంది.అందువల్ల రేజర్ ని పెట్టె ప్లాస్టిక్,డబ్బాలో ఈ సిలికా సంచులను ఉంచితే తేమను పీల్చుతాయి.

4.ఫోన్ నీటిలో పడినప్పుడు


ఫోన్ నీటిలో పడినప్పుడు, తడి అరటానికి బియ్యం జార్ లో పెట్టటానికి బదులు,సిలికా సంచులను ఉపయోగించవచ్చు.సిలికా సంచులు ఉన్న జార్ లో ఫోన్ పెడితే,మరింత సమర్ధవంతంగా తడి పోతుంది.

5.కారు విండోస్ మీద పొగ మంచు


ఈ తడి వాతావరణంలో పొగ మంచు కారు విండోస్ మీద అనేక సమస్యలను,సృష్టిస్తుంది.అప్పుడు కారు విండోస్ కింద కొన్ని సిలికా జెల్ సంచులను,ఉంచాలి.కొన్ని నిముషాలు అయ్యాక పొగ మంచు లేకపోవటం చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

6.ఫోటోలను భద్రపరచటానికి


పాత ఫోటోలు మనకు జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి.అలాగే అవి మనకు ఎంతో ప్రియమైనవి.

అటువంటి ఫోటోలు చెడిపోతే ఎంతో బాధగా ఉంటుంది.వాటిని నాశనం చేసే నెమ్ము నుండి కాపాడటానికి పాత ఫోటోలు ఉన్న బాక్స్ లో సిలికా సంచులను ఉంచాలి.

7.మేకప్ సామాగ్రి


పొడిగా ఉండే మేకప్ సామాగ్రి గట్టిగా కాకుండా ఉండాలంటే వాటిలో సిలికా సంచులను ఉంచాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube