జర్మనీ బీచ్‌ల‌లో షాకింగ్ రూల్స్.. బట్టలు వేసుకుంటే ఇక గెంటేస్తారట..?

నగ్న బీచ్‌లు అనేవి బాడీ షేమింగ్‌కి దూరంగా, ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా ఉండాలనుకునే వాళ్లకి ఇవి ఎప్పటినుంచో స్పెషల్ ప్లేస్‌లు.ఐతే జర్మనీలోని నార్త్ సైడ్ బీచ్‌ల‌లో మాత్రం రూల్స్ మారిపోయాయి.

 Shocking Rules On German Beaches, Germany Nude Beaches, Fkk Ban Clothes, Naturis-TeluguStop.com

ఇకపై నగ్న బీచ్‌కి వెళ్లినోళ్లు నూడ్ గానే ఉండాలి.స్విమ్ సూట్ వేసుకున్నా, డ్రెస్ వేసుకున్నా, అంతే, బయటకు గెంటేస్తారు.

అసలు ఈ బ్యాన్ వెనుక రీజన్ ఏంటంటే, జర్మనీలోని రోస్టాక్ సిటీలో ఈ గొడవ మొదలైంది.బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న ఈ సిటీకి నగ్నంగా వచ్చేవాళ్లూ ఉన్నారు, బట్టలేసుకుని వచ్చేవాళ్లూ ఉన్నారు.

ఐతే ఇక్కడే అసలు పంచాయితీ స్టార్ట్ అయ్యింది.నగ్నంగా తిరిగేవాళ్లకి, బట్టలేసుకుని చూసేవాళ్లని చూస్తే చిరాకొచ్చేస్తుందట.

బట్టలేసుకుని బీచ్‌లోకొస్తే, వాళ్లని చూసి నగ్నంగా ఉన్నోళ్లు అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతున్నారట.అందుకే రోస్టాక్ టూరిజం డిపార్ట్‌మెంట్ ఒక రూల్ పెట్టేసింది.

నగ్న బీచ్ అంటే నగ్నంగా ఉండేవారికే రిజర్వ్ అని ఫిక్స్ చేసింది.ఇక అంతే, ఎవరైనా బట్టలేసుకుని వస్తే బీచ్ వార్డెన్స్ వెంటనే వెళ్లిపోమంటారు.

రూల్స్ పెట్టామంటే సరిపోదు కదా, వాటిని పట్టించుకునే నాథుడెవరు? రోస్టాక్ పబ్లిక్ ఆర్డర్ డిపార్ట్‌మెంట్ ( Ordnungsamt ) వాళ్లు రంగంలోకి దిగుతారు.బీచ్‌ల చుట్టూ చక్కర్లు కొడుతూ ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తున్నారా అని కనిపెడతారు.

బట్టలేసుకుంటే ఫైన్ ఏమీ ఉండదులెండి కానీ, తీయమని మాత్రం గట్టిగా చెబుతారు.వినకపోతే మాత్రం బీచ్ నుంచి గెట్ ఔట్ చెప్పేస్తారు.

ఐతే కొంతమంది కౌన్సిల్ సభ్యులు మాత్రం ఈ రూల్స్ చాలా ఓల్డ్ ఫ్యాషన్ అనీ, స్టాఫ్ లేక వీటిని అమలు చేయడం కష్టమని అంటున్నారు.

జర్మనీలో నగ్నంగా ఉండటం అనేది ఇప్పుడేం కొత్త కాదు.దాదాపు 130 ఏళ్ల నుంచీ ఇక్కడ ‘ఫ్రీ బాడీ కల్చర్’ ( Freikörperkultur – FKK ) అనే ఒక మూవ్‌మెంటే నడుస్తోంది.దీన్నే తెలుగులో ‘స్వేచ్ఛా శరీర సంస్కృతి’( Free Body Culture ) అంటారు.

ఈ కల్చర్ ప్రకారం నగ్నంగా ఉండటం వల్ల శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా బాగుంటారట.అందుకే జర్మనీలో నగ్న బీచ్‌లు, పార్కులు, హైకింగ్ చేసే చోట్ల కూడా చాలా ఫేమస్.

ఐతే ఇప్పుడు యంగ్ జనరేషన్స్‌కి ఈ కల్చర్‌పై పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో నగ్న బీచ్‌ల సంఖ్య కూడా తగ్గిపోయింది.రోస్టాక్‌లో అయితే ఒకప్పుడు 37 నగ్న బీచ్‌లు ఉండేవి, ఇప్పుడు అవి 27కి పడిపోయాయి.

జర్మనీలో ట్రెండ్ తగ్గుతున్నా.ప్రపంచవ్యాప్తంగా మాత్రం నగ్నత్వం ఇంకా హాట్ టాపిక్కే.స్పెయిన్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్‌లాండ్, క్రొయేషియా లాంటి దేశాల్లో నగ్నంగా తిరగడం కామన్.ఫేమస్ నగ్న బీచ్‌ల లిస్ట్ చూస్తే.ఫ్రాన్స్‌లోని ప్లేజ్ డి టహిటి ( Plage de Tahiti ), కాలిఫోర్నియాలోని బ్లాక్ బీచ్ ( Black’s Beach ), ఆస్ట్రేలియాలోని లేడీ బే బీచ్ (Lady Bay Beach) టాప్‌లో ఉంటాయి.ఏది ఏమైనా.

జర్మనీ మాత్రం నగ్న బీచ్‌ల‌లో బట్టలు వేసుకుని తిరిగేవాళ్లకి బ్యాన్ పెట్టి, వాళ్ల పాత సంస్కృతిని కాపాడుకోవాలని చూస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube