దిల్ రుబా కథను రివీల్ చేసిన కిరణ్ అబ్బవరం.. క మూవీని మించిన హిట్ పక్కా!

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram )ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.

 Kiran Abbavaram Reveals Everything About Dil Ruba Movie, Kiran Abbavaram, Dil Ru-TeluguStop.com

ఇకపోతే కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలలో దిల్ రుబా సినిమా కూడా ఒకటి.ఇందులో కస్టమైజ్ చేసిన ఒక బైక్ వాడాడు అబ్బవరం.

ఆ బైక్ తో మొన్ననే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు.తమ సినిమా ప్లాట్ గెస్ చేసిన వాళ్లకు ఆ బైక్ ను బహుమతిగా ఇచ్చేస్తానని అన్నాడు.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వేదికపై బైక్ ను అందిస్తానంటూ ఘనంగా పోటీని ప్రకటించాడు.

Telugu Dil Ruba, Ka, Kiran Abbavaram, Kiranabbavaram, Tollywood-Movie

కానీ ఇప్పుడు తనే స్వయంగా దిల్ రుబా స్టోరీలైన్ ( Dil Ruba Storyline )ను బయట పెట్టేశాడు కిరణ్ అబ్బవరం.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ మాట్లాడుతూ.దిల్ రుబా జానర్ ఏంటి.

హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి.స్టోరీ లైన్ ఏంటనే విషయాల గురించి చెప్పారు.

దిల్ రుబా సినిమాలో హీరో ఎవ్వరికీ సారీ, థ్యాంక్స్ లాంటివి చెప్పడు.అది చిన్న విషయం అనిపించినప్పటికీ, అలా ఉండడం చాలా కష్టం.

అదే అతడికి ఇబ్బంది కూడా తెచ్చిపెడుతుంది.ఇది హీరో క్యారెక్టరైజేషన్.

ఇక కథ విషయానికొస్తే.

Telugu Dil Ruba, Ka, Kiran Abbavaram, Kiranabbavaram, Tollywood-Movie

అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ తో ఉన్న హీరోకి ఆల్రెడీ హీరోయిన్ తో బ్రేకప్ అయిపోతుంది.ఆ తర్వాత మరో హీరోయిన్ కు కనెక్ట్ అవుతాడు.అది కూడా బ్రేకప్ స్టేజ్ కు వెళ్లే దశలో మాజీ ప్రేయసి సీన్ లోకి వచ్చి, హీరో ప్రజెంట్ లవ్ స్టోరీని ఎలా సెట్ చేసిందనేది దిల్ రుబా స్టోరీ.

ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు కిరణ్ అబ్బవరం.మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube