ఈ ఒక్కటి డైట్ లో ఉంటే ప్రోటీన్ కొరత అన్న మాటే అనరు!

ప్రస్తుత రోజుల్లో కోట్లాది మంది ప్రోటీన్( Protein ) కొరతతో బాధపడుతున్నారు.శాకాహారుల్లో ఈ సమస్య అత్యధికంగా కనిపిస్తుంది.

 Best Way To Get Rid Of Protein Deficiency!, Protein Deficiency, Protein, Latest-TeluguStop.com

మన శరీరానికి అత్యంత అవసరమ‌య్యే పోషకాల్లో ప్రోటీన్ ఒకటి.రెగ్యులర్ గా మన బాడీకి ప్రోటీన్ ను అందించాలి.

కానీ ఈ విషయంలో చాలా మంది అజాగ్రత్త వహిస్తున్నారు.దాంతో శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడుతుంది.

నీరసం, అలసట, మెదడు పనితీరు మందగించడం, కండరాల బలహీనత, శరీరం ఏ పనికి సహకరించకపోవడం, అతి ఆకలి, ఒత్తిడి( Stress ), చికాకు, తలనొప్పి, జుట్టు విపరీతంగా రాలడం, చర్మం యొక్క నిగారింపు తగ్గిపోవడం.ఇవన్నీ ప్రోటీన్ కొరత యొక్క లక్షణాలు.

అందుకే ప్రోటీన్ కొర‌త‌ను అంత తేలికగా తీసుకోరాదు.అయితే మీరు ప్రోటీన్ లోపం( Protein Deficiency ) తో బాధపడుతున్నారా? వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే చాలు ప్రోటీన్ కొరత అన్న మాటే అనరు.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Latest, Protein, Spinachprotein-Telugu Health

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పాలకూర ఆకులు( Spinach ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి.చివరిగా నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ) మరియు ఒక గ్లాస్ బాదం పాలు( Almond Milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్పినాచ్ ప్రోటీన్ షేక్( Spinach Protein Shake ) సిద్ధం అవుతుంది.

Telugu Tips, Latest, Protein, Spinachprotein-Telugu Health

ప్రతిరోజు ఉదయం ఈ ప్రోటీన్ షేక్( Protein Shake ) ను తీసుకోవాలి.దాంతో శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ స‌మృద్ధిగా లభిస్తుంది.ఫలితంగా ప్రోటీన్ కొరత యొక్క లక్షణాల నుండి విముక్తి పొందుతారు.కాబట్టి ఎవరైతే ప్రోటీన్ కొరతతో బాధపడుతున్నారో తప్పకుండా ఈ స్పినాచ్ షేక్ ను డైట్ లో చేర్చుకోండి.

ప్రోటీన్ కొర‌త‌ను నివారించ‌డానికి ఇది ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డుతుంది.పైగా ఈ స్పినాచ్ షేక్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది.

మెదడు పనితీరు మరింత మెరుగుపడుతుంది.వెయిట్ లాస్ కూడా అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube