రోజు నైట్ ఈ న్యాచురల్ క్రీమ్ ను ముఖానికి రాస్తే 60 లోనూ యవ్వనంగా కనిపిస్తారు!

ఇటీవల రోజుల్లో ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, చెడు వ్యసనాలు తదితర కారణాల వల్ల చాలా మందిలో పాతిక, ముప్పై ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడుతుంటాయి.ముఖం పై ముడతలు, చర్మం సాగటం, చారలు ఇవన్నీ వృద్ధాప్య లక్షణాలే.

 Natural Cream For Youthful Skin Even At 60! Face Cream, Youthful Skin, Skin Care-TeluguStop.com

ఇవి యవ్వనం తో పాటు మన ఆత్మ ధైర్యాన్ని సైతం దెబ్బతీస్తాయి.ఈ క్రమంలోనే వాటిని వదిలించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ గ్రేట్ గా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ క్రీమ్ ను ముఖానికి రాస్తే 60 లోనూ యవ్వనంగా కనిపిస్తారు.

మరి ఇంకెందుకు లేటు ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక చిన్న కీర దోసకాయ( Cucumber )ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.

ఈ తురుము నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.అలాగే ఒక కప్పు హాట్ వాటర్ తీసుకుని అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ) వేసుకోవాలి.

Telugu Tips, Face Cream, Skin, Latest, Natural Cream, Skin Care, Skin Care Tips,

అలాగే రెండు టేబుల్ స్పూన్లు కీరా దోసకాయ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ( Green tea ), నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని ఐదారు నిమిషాల పాటు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన మ్యాజికల్ క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

Telugu Tips, Face Cream, Skin, Latest, Natural Cream, Skin Care, Skin Care Tips,

నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.రోజు నైట్ ఈ క్రీమ్ ను కనుక వాడితే చర్మం టైట్ గా మారుతుంది.ముడతలు, చారలు పరార్ అవుతాయి.60 లోనూ యవ్వనంగా కనిపిస్తారు.అలాగే ఈ క్రీమ్ ను రోజు నైట్ రాసుకోవడం వల్ల చర్మం ఉదయానికి బ్రైట్ గా మెరుస్తుంది.చర్మంపై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.

మరియు స్కిన్ స్మూత్ గా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube