హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టైంది.జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మరియు కేబీఆర్ పార్క్ వద్ద భిక్షాటన చేస్తున్న సుమారు 23 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఈ బెగ్గింగ్ మాఫియాకు నిర్వహకుడిగా ఉన్న అనిల్ పవార్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా అనేక ప్రాంతాల నుంచి వృద్ధులను తీసుకువచ్చి రోజుకు రూ.200 వేతనం ఇస్తూ భిక్షాటన చేయిస్తున్నట్లుగా గుర్తించారు.వృద్ధులతో బెగ్గింగ్ చేయించి డబ్బులు సంపాదిస్తున్న అనిల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అదేవిధంగా నగర వ్యాప్తంగా కొనసాగుతున్న బెగ్గింగ్ రాకెట్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దృష్టి సారించారు.