Raisins : ఎండు ద్రాక్ష క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

డ్రై ఫ్రూట్స్( Dry Fruits ) ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని చాలామందికి తెలుసు.డ్రై ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 Health Benefits Of Taking Raisins In Your Daily Diet Plan-TeluguStop.com

కాబట్టి ఖచ్చితంగా ఎండు ద్రాక్షని అందరూ క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.కానీ ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండు ద్రాక్ష( Raisins ) తినడం వల్ల పొట్టను శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది.

జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.ఇక అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజు 8 నుంచి 10 ఎండు ద్రాక్షను తినాలి.

ఇందులో పొటాషియం, పీచు ఎక్కువగా ఉండడం వల్ల బీపీని నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.మీకు బలహీనమైన ఎముకలు లేదా కండరాల నొప్పులు ఉన్నట్లయితే మీరు రోజు నానబెట్టిన ఎండు ద్రాక్షను తీసుకోవాలి.

ఎండు ద్రాక్షలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

Telugu Bad Cholestrol, Pressure, Dry Fruits, Dry Grapes, Raisins, Benefits, Immu

ఇది మీ ఎముకలను( Bones ) కచ్చితంగా బలోపేతం చేస్తుంది.రోజు ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే శరీరం నుంచి హనికరమైన కొలెస్ట్రాల్ ను( Bad Cholestrol ) ఇది తొలగిస్తుంది.

ఇక విటమిన్లు, ఖనిజాలను ఇది కలిగి ఉంటుంది.అలాగే కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది.ఇది శరీరం నుంచి విషాన్ని కూడా తొలగిస్తుంది.ఈ నీటితో జీర్ణ శక్తి పెరుగుతుంది.

Telugu Bad Cholestrol, Pressure, Dry Fruits, Dry Grapes, Raisins, Benefits, Immu

రాత్రి నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్షను( Soaked Raisins ) ఉదయాన్నే తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.ఎందుకంటే నానబెట్టిన ఎండు ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇది రోగనిరోధక శక్తిని( Immunity Power ) పెంచుతుంది.ఎండు ద్రాక్ష నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.అలాగే శరీరం నుంచి హానికరమైన కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.కాబట్టి ఖచ్చితంగా ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube