ఒక్క సినిమా... ఎన్ని ఖండిషన్స్.. చివరికి ఏం మిగిలింది ?

1981 ఆగస్టు 14న సిల్‌సిలా అనే ఒక బాలీవుడ్ చిత్రం విడుదలైంది.ఈ చిత్రంలో అమితాబచ్చన్, రేఖా, జయ మాధురి హీరో హీరోయిన్స్ గా నటించారు.

 Untold Story Behind Silsila Movie , Untold Story ,silsila Movie , Bollywood Movi-TeluguStop.com

భార్యా, భర్త మరియు ప్రియురాలు అనే కథాంశంతో ఈ సినిమా తెరపైకొచ్చింది.ఈ సినిమాలోని పాటలు అద్భుతంగా ఉన్నప్పటికి ఈ సినిమా మాత్రం పరాజయం పాలైంది.

వాస్తవానికి ఈ సినిమా వెనక బయట ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలు దాగి ఉన్నాయి.ఈ సినిమా ఒక భార్యకు తన భర్తను శాశ్వతంగా ఇస్తే, ప్రియురాలికి ప్రేమికుడిని శాశ్వతంగా దూరం చేసింది.

ఆ భర్త అమితాబ్ కాగా, భార్య జయ భాదురి, ప్రియురాలు రేఖ.వీరి జీవితంతో సిల్‌సిలా సినిమాకు ఉన్న కనెక్షన్ ఏంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం పదండి.

ఈ సినిమా చేయాలని దర్శకుడు యష్ చోప్రా భావించినప్పుడు తొలుత నీతూ పర్వీన్, స్మిత పాటిల్ ని హీరో హీరోయిన్స్ గా తీసుకోవాలని అనుకున్నాడు.కానీ అమితాబచ్చన్ కి, రేఖకు మధ్య అప్పటికే ప్రేమాయణం సాగుతుందని భావించిన దర్శకుడు నీతూ, స్మిత పాత్రల్లో జయా మాధురి మరియు రేఖలను తీసుకోవాలని అమితాబచ్చన్ ని అడిగాడు.

అమితాబ్ వద్దు అని చెప్పిన దర్శకుడు మాత్రం అన్ని జరుగుతాయి మీరైతే ఓసారి అడిగి చూడండి అంటూ ఒప్పించగా, ఆయన ఊహించినట్టుగానే జయ అందుకు ఒప్పుకుంది.భార్య స్థానంలో జయ నటించగా అమే భర్త స్థానంలో అమితాబ్ బచ్చన్ నటించాడు.

ప్రియురాలి పాత్రలో రేఖ నటించింది.వాస్తవానికి అమితాబ్ మరియు రేఖ నటించిన చివరి చిత్రం కూడా ఇదే.

వీరిద్దరూ కలిసి అప్పటికే 14 సినిమాల్లో నటించారు.సిల్‌సిలా సినిమా తర్వాత కూడా రేఖ విడిగా హీరోయిన్ గా ఒక 80 సినిమాల్లో నటించింది.అలాగే అమితాబ్ కూడా ఒక 150 సినిమాల్లో నటించాడు.అయితే వీరి కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉన్న కూడా ఎందుకు మళ్ళీ కలిసి నటించలేదు అని చాలా మంది సందేహ పడ్డారు.

అందుకు గల కారణం ఏంటి అంటే సిల్‌సిలా సినిమాలో నటించాలి అంటే జయ ఒక కండిషన్ పెట్టారట.ఇక పై రేఖ తో మరొక సినిమా చేయను అని మాట ఇస్తేనే ఆ చిత్రంలో నటిస్తాననీ చెప్పారట.

దాంతో వీరిద్దరికీ ఇదే చివరి చిత్రం అయ్యింది.అలా ఒక భగ్న ప్రేమ కథ ముగిసిపోయింది.

రేఖా ఇప్పటికీ మౌనంగా అమితాబ్ నీ మౌనంగా ఘాడంగా ప్రేమిస్తూనే ఉంది.కానీ అమితాబ్ అమే ప్రేమను ఏనాడు ఒప్పుకోలేదు.అయితే అమే ముందుకు రావడానికి కూడా అమితాబ్ కాస్త తటపటాయిస్తూ ఉంటాడు.కానీ అమితాబ్ కి కూడా రేఖ పై ఎంతో ప్రేమ ఉంటుందని కొందరి వాదన.

ఏది ఏమైనా చరిత్రలో ఎన్నో భగ్న ప్రేమ కథల్లో వీరి ప్రేమ కథ కూడా తప్పక ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube