లైగర్ ఫ్లాప్ అవడంతో డిస్ట్రబ్ అయిన విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా ఖుషి మీద నమ్మకం పెట్టుకున్నాడు.శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ తో వస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.అంతేకాదు ఈ సినిమాలో సమంత, విజయ్ ల మధ్య లవ్ సీన్స్ హైలెట్ గా ఉంటాయని అంటున్నారు.
ఖుషి టైటిల్ ఎందుకు పెట్టారో ఆ సీన్స్ చూస్తే అర్ధమవుతుంది.పవన్ సినిమా ఖుషికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు కానీ ఆ టైటిల్ మాత్రం దీనికి పర్ఫెక్ట్ అని అంటున్నారు.
ఖుషి సినిమాలో విజయ్ సమంత ల మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా చాలా ఉన్నాయని అంటున్నారు.తన సినిమాలో లిప్ లాక్ ఖచ్చితంగా ఉండేలా చూసుకునే విజయ్ ఖుషిలో సమంతతో కూడా అదరచుంబనం చేసినట్టు టాక్.

మొత్తానికి ఖుషి మూవీ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.తప్పకుండా సినిమా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెబుతున్నారు.మరి విజయ్ ని ఫ్లాపుల నుంచి ఖుషి బయట పడేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.







