ప్రతి అమ్మాయి ఒత్తైన,అందమైన జుట్టు కావాలని కోరుకుంటారు.అయితే మారిన జీవనశైలి, ఆరోగ్య సంబంధిత సమస్యలు, ఒత్తిడి, కాలుష్యం, అసమతుల్య ఆహారం వంటి కారణాల వలన జుట్టు రాలిపోయి నిస్తేజంగా మారుతుంది.
ఇప్పుడు చెప్పే మాస్క్ కుదుళ్లకు బలాన్ని ఇచ్చి జుట్టు రాలకుండా బలంగా పెరిగేలా చేస్తుంది.ఇప్పుడు ఆ మాస్క్ గురించి తెలుసుకుందాం.
మాస్క్ కి కావలసిన పదార్ధలు
1 స్పూన్ ఉసిరి పొడి 2 టీస్పూన్ శీకాయ పొడి 3 టీస్పూన్ కుంకుడుకాయ పొడి 4 టీస్పూన్ల నువ్వుల నూనె 5 టీస్పూన్ కలబంద గుజ్జు .
ఉసిరిపొడిలో జుట్టును బలంగా చేసే పోషకాలు,విటమిన్ సి అధికంగా ఉంటాయి.శీకాయ పొడిలో జుట్టు కండిషనింగ్ కి సహాయపడే విటమిన్స్ ఉంటాయి.కుంకుడు కాయ పొడిలో శిలీంధ్ర వ్యతిరేక లక్షణాలు ఉండుట వలన జుట్టు రాలకుండా సహాయపడుతుంది.
కలబంద జుట్టు రాలడానికి కారణమైన సమస్యను తగ్గిస్తుంది.నువ్వులనూనె జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది.
మాస్క్ తయారి విధానం
ఒక బౌల్ లో ఉసిరి పొడి,శీకాయ పొడి,కుంకుడుకాయ పొడి వేసి బాగా కలిపి ఆ తర్వాత కలబంద గుజ్జు,నువ్వులనూనె వేసి బాగా కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.ఈ మాస్క్ ని వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.