టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్,( Victory Venkatesh ) అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబినేషన్ లో తాజాగా విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.( Sankranthiki Vasthunnam ) తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.
ఫుల్ పక్క ఎంటర్టైనర్ సినిమాగా తిరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది.ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వెంకీ మామ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.దీంతో మొదటి రోజే ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి.
తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సరికొత్త పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.పండగకి వచ్చారు.పండగని తెచ్చారు అంటూ ఆడియెన్స కు ధన్యవాదాలు తెలిపింది.
కాగా విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది.దీంతో చిత్ర బృందం అంతా సంతోషంలో మునిగి తేలుతోంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సంక్రాంతి సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది.దీంతో మొదటి రోజే రికార్డు కలెక్షన్స్ నమోదయ్యాయి.
ఓవర్సీస్‌లో తొలి రోజు సినిమా సుమారు 7 లక్షల డాలర్ల వసూళ్లు చేసింది.

వెంకటేశ్ కెరీర్‌లో ఇంత భారీ ఓవర్సీస్ కలెక్షన్లు రాబట్టిన మొదటి సినిమా ఇదే అని చిత్ర బృందం ప్రకటించింది.ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే.సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ లు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.
అలాగే వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార, రఘుబాబు, నరేశ్, ప్రియదర్శి, మురళీ ధర్, పృథ్వీ రాజ్, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.