సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ వస్తుందా.. ఈ కాంబోలో సీక్వెల్ వస్తే హిట్ అంటూ?

విక్టరీ వెంకటేశ్ కు( Victory Venkatesh ) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాతో వెంకటేశ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

 Sankranthiki Vasthunnam Movie Sequel Crazy Update Details, Sankranthiki Vasthunn-TeluguStop.com

ఈ సినిమా తొలిరోజే ఏకంగా 45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి.

సంక్రాంతి వస్తున్నాం సినిమా ఈరోజు కలెక్షన్లతోనే కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.

ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలకు ఎంతో ప్లస్ అయింది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ తో వెంకటేశ్ మార్కెట్ కూడా ఊహించని స్థాయిలో పెరిగింది.

వెంకటేశ్ కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పూర్వ వైభవం వచ్చిందని చెప్పవచ్చు.

Telugu Anil Ravipudi, Tollywood, Venkatesh-Movie

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్( Sankranthiki Vasthunnam Sequel ) వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) సైతం ఈ సినిమాకు సీక్వెల్ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనిల్ రావిపూడి ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.వెంకటేశ్ రెమ్యునరేషన్ సైతం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

Telugu Anil Ravipudi, Tollywood, Venkatesh-Movie

విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు రావాల్సి ఉంది.వెంకటేశ్ తర్వాత సినిమాలతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ రన్ లో 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి.2025 వెంకటేశ్ కు మాత్రం శుభారంభాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube