ప్రతిరోజు ఒక లవంగాన్ని నమలడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలుసా?

మన ఇండియన్ స్పైసెస్ లో లవంగాలు( Cloves ) ఒకటి.చాలా ఆకర్షణీయంగా కనిపించే లవంగాలు ఘాటైన రుచి, వాసన కలిగి ఉంటాయి.

లవంగాలను ప్రధానంగా బిర్యానీ, పులావ్, నాన్ వెజ్ వంటల్లో వాడుతుంటారు.చూడటానికి చిన్నగా ఉన్నా కూడా లవంగాల్లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యానికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా ప్రతిరోజు ఒక లవంగాన్ని నమిలి తినడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు చేకూరుతాయి.

అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.మనలో చాలా మంది నోటి దుర్వాసన( Bad Breath ) సమస్యతో బాధపడుతుంటారు.

Advertisement

ఎన్ని రకాల టూత్ పేస్ట్ లు వాడిన సరే ఈ సమస్యను వదిలించుకోలేకపోతుంటారు.అలాంటి వారికి లవంగాలు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.

రోజుకు ఒక లవంగాన్ని నమలడం వల్ల నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టవచ్చు.అదే సమయంలో లవంగాలు దంతాల పోటు, వాపు, దంతాల నుంచి రక్తస్రావం వంటి సమస్యలను సైతం నివారిస్తుంది.

అలాగే రోజుకు ఒక లవంగాన్ని నమిలి తినడం వల్ల జీర్ణక్రియ( Digestion ) చురుగ్గా మారుతుంది.పేగు కదలికలు మెరుగుపడతాయి.ఫ‌లితంగా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

లవంగాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.మోకాళ్ళ నొప్పులతో( Knee Pains ) బాధపడే వారికి లవంగం ఒక న్యాచురల్ పెయిన్ రిలీవర్‌గా పనిచేస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది ప‌డుతున్న‌వారు నిత్యం ఒక లవంగాన్ని నమలడం ఎంతో మంచిది.

Advertisement

ప్రతిరోజు లవంగాన్ని తిన‌డం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.జలుబు, ఫ్లూ, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు పరార్ అవుతాయి.లవంగాలు కాలేయ ఆరోగ్యానికి కూడా అండగా నిలుస్తాయి.

నిత్యం ఒక లవంగాన్ని తీసుకుంటే కాలేయ సంబంధిత వ్యాధులకు సైతం దూరంగా ఉండవచ్చు.

తాజా వార్తలు