ఈ మధ్యకాలంలో చాలా మంది ఆడవారిలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు( Health Problems ) వస్తున్నాయి.అలాగే విటమిన్ ఏ సాధారణంగా కంటి ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది.
కానీ ఇది ఒక వ్యక్తి సంతాన ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుందని ఒక అధ్యయనంలో తెలిసింది.విటమిన్ ఏ( Vitamin A ) మీ పునరుత్పత్తి వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అటువంటి పరిస్థితుల్లో విటమిన్ ఏ లోపం సంతానం లేమి( Infertility ) ఇబ్బందులను కలిగిస్తుంది.విటమిన్ ఏ లోపం శరీరంలో ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ ఏ శరీరంలో తయారు అవ్వదు.విటమిన్ ఏ ను ఆహారాల నుంచి మాత్రమే పొందవచ్చు.
అటువంటి పరిస్థితుల్లో శరీరం ఆహారాన్ని సరిగ్గా గ్రహించలేనప్పుడు విటమిన్ ఏ లోపం ఏర్పడుతుంది.అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా విటమిన్ ఏ లోపం లక్షణాలను ఎదుర్కొంటారు.
ఈ ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల విటమిన్ ఏ లోపం నుంచి త్వరగా బయటపడవచ్చు.

విటమిన్ ఏ లోపం( Vitamin A Deficiency ) వల్ల కలిగే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే తక్కువ వెలుతురులో చూడలేకపోవడం, కళ్ళు పొడిబారడం, చర్మం పొడిబారడం, పిల్లలు నెమ్మదిగా ఎదగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.అలాగే విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే చిలకడదుంప లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది.అలాగే చిలకడదుంప ఉడికించి తింటే శరీరానికి విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది.

అలాగే క్యారెట్( Carrot ) లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది.అరకప్పు పచ్చి క్యారెట్ లో 459 ఎంసిజి విటమిన్ ఏ ఉంటుంది.అంతేకాకుండా క్యారెట్ లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.ఇంకా చెప్పాలంటే పాలకూర( Spinach ) అనేక పోషకాలతో నిండి ఉంటుంది.అరకప్పు ఉడికించిన బచ్చలి కూరలో 573 ఎంసిజి విటమిన్ ఏ ఉంటుంది.
అలాగే పచ్చి మామిడిలో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది.ఇది పేగు యొక్క మెరుగైన పని తీరుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.