ఆర్ (రేవంత్) టాక్స్ తో భయపడుతున్న బిల్డర్స్: బీజేపీ ఎంపీ అభ్యర్ధి బూర

యాదాద్రి భువనగిరి జిల్లా:కాంగ్రెస్ పాలనలో ఓ పక్క హైదరాబాద్ బిల్డర్స్ ఆర్ (రేవంత్ రెడ్డి) టాక్స్ తో ఆగంపడుతుంటే,మరోపక్క యాదాద్రి భువనగిరి జిల్లా మిల్లర్స్ కస్టమ్స్ కు రూ.100 నుండి 120 కోట్లు చెల్లించేది ఉండగా దానిని సెటిల్మెంట్ చేసేందుకు జిల్లా మంత్రి రూ.20 కోట్లు తీసుకున్నారని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు.శుక్రవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో పలు చేనేత కార్మికుల కుటుంబాలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 R (revanth) Builders Bjp Mp Candidate Boora Who Is Afraid Of Tax , Boora Narsai-TeluguStop.com

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తెరచాటు ప్రేమ ఉందని,రెండు పార్టీలు ఒకటేనని అన్నారు.గత పదేళ్ళు చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహించలేదని,జియో ట్యాగింగ్ పేరిట చేనేత మగ్గాలను కుదించారని,చేనేత కార్మికులకు అందాల్సిన సబ్సిడీలు విడుదల చేయకుండా వారి సమస్యలను గాలికొదిలేసి చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత బజార్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube