ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో(Mainpuri, Uttar Pradesh) ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.ఒక నేరస్థుడి చేతులకు తాడుతో సంకెళ్లు వేసి, బైక్‌ను(Chained with rope, the bike) అతని చేతే నడిపించాడో పోలీస్.
రోడ్డుపై వీరు వెళుతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.అంతేకాదు కారులో వెళ్తున్న ఒక ప్యాసింజర్ ఈ అసాధారణ దృశ్యాన్ని వీడియో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.
ఆ వీడియోలో, నేరస్థుడు హెల్మెట్ (Helmet)లేకుండా బైక్ (Bike)నడుపుతున్నాడు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక పోలీసు అధికారి వెనుక కూర్చుని ఉన్నాడు.అయితే, ఆ అధికారి మాత్రం హెల్మెట్ ధరించి ఉన్నాడు.చలికాలం కావడంతో చలిగా ఉందని కానిస్టేబుల్ నేరస్థుడిని బైక్ నడపమని అడిగాడని సమాచారం.
వైరల్ వీడియో ఓపెన్ చేయగానే మనకు నేరస్థుడి చేతులను తాడుతో కట్టి ఉండటం కనిపిస్తుంది.ఆ తాడు అతని మణికట్టు నుంచి వెనుక కూర్చున్న అధికారి చేతి వరకు ఉంది.
బహిరంగ రహదారిపై నేరస్థుడు బైక్ నడుపుతూ వెళ్లడం చాలా వింతగా అనిపించింది.ఒకవేళ అతను బైక్ ను వేరే మార్గంలో నడిపి పోలీసులు గట్టి పారిపోతే పరిస్థితి ఏంటి? వంటి సందేహాలు చాలామందికి వస్తున్నాయి.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో మిక్స్డ్ రియాక్షన్స్ ను(Mixed reactions) రేకెత్తించింది.చలిలో పోలీసు అధికారి బైక్ నడపకుండా ఉండటం సమంజసమే అని కొందరు దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాదు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.మరికొంతమంది మాత్రం ఖైదీని వాహనాన్ని నియంత్రించడానికి అనుమతించడం మూర్ఖత్వం, అనుచితమని విమర్శించారు.

పోలీసులు(Police) ఆ అధికారిని భోంగావ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌గా గుర్తించారు.అయితే, నేరస్థుడి గురించి లేదా అతని అరెస్టుకు గల కారణం గురించి ఎటువంటి సమాచారం ఇంకా వెల్లడించలేదు.ఈ సంఘటనపై స్పందిస్తూ, మెయిన్‌పురి పోలీసులు X (గతంలో ట్విట్టర్)లో సదరు పోలీస్ అధికారిని విచారణకు ఆదేశించామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని పోస్ట్ చేశారు.ఈ అసాధారణ సంఘటన భద్రత, పోలీసు విధానాలపై ప్రశ్నలను లేవనెత్తింది.
ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.







