తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాగార్జునకు( Nagarjuna ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు తనకు మంచి గుర్తింపుని తీసుకురావడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసే సినిమాల విషయంలో కేర్ ఫుల్ గా ఉంటున్నాడు.
అయినప్పటికి ఆయనకు ప్లాపులు మాత్రం తప్పడం లేదు.

ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.ఇక దాంతోపాటుగా రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో విలన్ పాత్రను కూడా పోషిస్తున్నాడు.ఇక శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా ఆ సినిమాలో తన పాత్ర సినిమా మొత్తానికి కీలకంగా మారబోతుందనే కాన్ఫిడెంట్ కూడా వ్యక్తం చేస్తున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా నాగార్జున ఇప్పుడు తన వందో సినిమాతో సక్సెస్ సాధిస్తే తప్ప సీనియర్ హీరోలందరితో పోటీ పడే పరిస్థితిలో అయితే లేడు.ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంటే నాగార్జున చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ గానే మిగులుతుంది.

కాబట్టి ఇప్పుడు తనను తాను స్టార్ హీరోగా మరోసారి ఎలివేట్ చేసుకోవాలంటే భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.మరి తన వందో సినిమాకి దర్శకుడుగా ఎవరు చేయబోతున్నారనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే కలుగుతుంది… ఇక దీని మీద రోజుకొక దర్శకుడి పేరు వినిపిస్తున్నప్పటికి నాగార్జున మాత్రం ఇంకా అఫీషియల్ గా ఏ డైరెక్టర్ ని కూడా కన్ఫామ్ చేయలేదు.అందరినీ హోల్డ్ లోనే పట్టారు.మరి వారిలో ఎవరి సినిమాని ఫైనల్ చేస్తాడనేది తెలియాల్సి ఉంది…
.