తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు నెల్సన్( Director Nelson )… ప్రస్తుతం ఆయన రజనీకాంత్ తో జైలర్ 2( Jailer 2 ) అనే సినిమాలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.అయితే రజనీకాంత్ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ‘కూలీ ‘ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే నెల్సన్ డైరెక్షన్ లో చేయాల్సిన ‘జైలర్ 2’ సినిమా మీద తన ఫోకస్ ని షిఫ్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నెల్సన్ జైలర్ 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక భారీ ప్రాజెక్టును చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ( Allu Arjun )తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన అట్లీతో ఒక భారీ ప్రాజెక్టుని చేయాల్సింది.కానీ అనుకోని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది.దాంతో అట్లీ అదే స్టోరీని సల్మాన్ ఖాన్ ను హీరోగా పెట్టి చేస్తున్నాడు.ఇక ఇప్పుడు నెల్సన్ లాంటి మరో కమర్షియల్ డైరెక్టర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కబోతుందనే దానిమీద సరైన క్లారిటీ లేదు.కానీ మొత్తానికైతే నెల్సన్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఏ పాయింట్ తో తెరకెక్కుతుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.నెల్సన్ అంటే కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారుతున్న డైరెక్టర్ కాబట్టి ఆయన చేయబోయే సినిమాలు పక్క కమర్షియల్ జానర్లో ఉండడమే కాకుండా ఆ సినిమా భారీ ఎలివేషన్స్ తో కూడుకొని ఉంటాయి.కాబట్టి మరోసారి అల్లు అర్జున్ భారీ ఎలివేషన్స్ తో సక్సెస్ ని కొట్టబోతున్నట్టుగా తెలుస్తోంది…
.