ప్రభాస్ స్పిరిట్ మూవీ కథ ఇదేనా.. ఈ కథలో ట్విస్టులు తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు డార్లింగ్ ప్రభాస్.

 Key Update On Prabhas Upcoming Movie Spirit Story Details, Prabhas, Spirit Movie-TeluguStop.com

ప్రస్తుతం ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో టాప్ హీరోగా రాణిస్తూ దూసుకుపోతున్నారు.తాగా ప్రస్తుతం డార్లింగ్ చేతిలో అరడజన్ కు పైగా పాన్ ఇండియా ప్రాజెక్టులో ఉన్న విషయం తెలిసిందే.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

Telugu Ma Dong Seok, Prabhas, Prabhas Spirit, Prabhasspirit, Sandeepreddy, Spiri

ఒక్కో సినిమాను ఒక్కో డిఫరెంట్ జానర్‌ లో ట్రై చేస్తున్న డార్లింగ్, నెమ్మదిగా ఇంటర్నేషనల్‌ ఆడియన్స్‌ ను టార్గెట్ చేస్తున్నారు.ప్రస్తుతం ది రాజాసాబ్‌,( The Rajasaab ) ఫౌజీ( Fauji ) సినిమాల షూట్‌ లో పాల్గొంటున్న ప్రభాస్‌ ఆ తరువాత దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.స్పిరిట్‌( Spirit Movie ) పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇప్పటి వరకు స్పిరిట్ సినిమాకు సంబంధించి ఒకే ఒక్క అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు సందీప్‌.

ఈ సినిమాలో ప్రభాస్‌ రూత్‌ లెస్‌ కాప్‌ గా కనిపించబోతున్నారని తెలిపారు.అంతేకాదు ఫస్ట్ టైమ్ డార్లింగ్‌ యూనిఫామ్‌ లో కనిపిస్తారని క్లారిటీ ఇచ్చారు.ఈ అప్‌డేట్‌ తో డార్లింగ్ ఫ్యాన్స్‌ లో అంచనాలు పీక్స్‌ కు చేరాయి.

Telugu Ma Dong Seok, Prabhas, Prabhas Spirit, Prabhasspirit, Sandeepreddy, Spiri

ఆ తరువాత అంచనాలు డబుల్ చేసే అప్‌ డేట్స్ సోషల్ మీడియాలో రెగ్యులర్‌ గా ట్రెండ్ అవుతున్నాయి.ఈ సినిమాలో కొరియన్ స్టార్ హీరో మా డాంగ్ సియోక్( Ma Dong-Seok ) కీలక పాత్రలో నటిస్తున్నారన్న వార్త ఫిలిం సర్కిల్స్‌ లో వైరల్ అవుతోంది.అంతేకాదు సియోక్ వర్సెస్ ప్రభాస్ సీన్స్‌ ను సందీప్‌ నెక్ట్స్ లెవల్‌లో డిజైన్ చేస్తున్నారట.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ కాంబోకు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేమిటంటే ఈ మూవీలో సియోక్ ఇంటర్నేషన్‌ మాఫియా డాన్‌ గా కనిపిస్తారని, ప్రభాస్‌ అతన్ని ఎదిరించే ఇండియన్ పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపించబోతున్నారన్నది నయా అప్‌ డేట్‌.అంటే స్పిరిట్ కథ కూడా గ్లోబల్‌ రేంజ్‌ లోనే ఉండబోతుంది అన్న విషయం బాగా అర్థమవుతోంది.

ఈ అప్‌డేట్ తరువాత ఫ్యాన్స్‌ లో జోష్ మరింత పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube