తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రాధిక ఆప్టే( Heroine Radhika Apte ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో పలు సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఒక తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, మరాఠీ,బెంగాలీ,ఇంగ్లీష్ భాషల సినిమాలలో నటించి భారీగా గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా భారీగా అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగులో లెజెండ్,లయన్,రక్త చరిత్ర లాంటి సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

ఆ తరువాత హీరోయిన్గా కంటే ఎక్కువగా న్యూడ్ సెమి న్యూడ్ సినిమాలలో నటించింది.ఎక్కువగా ఈ తరహా సినిమాల్లోని ఈమె నటించింది.ఇలాంటి పాత్రల్లో నటించినందుకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా భారీగా వచ్చాయి.
కానీ అవి ఏవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది రాధిక ఆప్టే. కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే.
బ్రిటిష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్ ను( Benedict Taylor ) పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.అయితే 2012లో ఈ దంపతులకు వివాహం జరగగా ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు.

తాజాగా అనగా వారం రోజుల కిందట తను ఆడబిడ్డకు( Baby Girl ) జన్మనిచ్చినట్టు రాధిక ఆప్టే తెలిపింది.ఇదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలుపుతూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.బిడ్డకు పాలు పడుతున్న ఫోటోని షేర్ చేస్తూ డెలివరీ తర్వాత వర్క్ మీటింగ్ అని ఒక ఫోటోని కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఆ ఫోటోలో ఒకవైపు ఒడిలో లాప్టాప్ పెట్టుకొని వర్క్ చేస్తూనే మరోవైపు బిడ్డకు పాలు పడుతోంది.
అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.రాధిక కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇంకొందరు రాధిక అలా ఎదురుగా లాప్టాప్ పెట్టుకొని ఫీడింగ్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.