టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు జక్కన్న.
ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును సృష్టించాయి.అంతేకాకుండా సినిమాలు ఒకదానిని మించి ఒకటి రికార్డుల మోత మోగించాలి.
కాగా జక్కన్న చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మహేష్ బాబు తో( Mahesh Babu ) తెరకెక్కించబోయే సినిమాలకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళి రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న రానా టాక్ షోలో( Rana Talk Show ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ షోలో భాగంగా మాట్లాడుతూ తన ఇంటర్మీడియట్ ప్రేమ కథను బయటపెట్టారు జక్కన్న.ఈ మేరకు ఈ షోలో భాగంగా జక్కన్న మాట్లాడుతూ.ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక అమ్మాయి ఉండేది.ఆమె అంటే ఇష్టం.కానీ ఆమెతో మాట్లాడాలంటే భయం.ఆ విషయం మా క్లాస్ లో అబ్బాయిలు అందరికీ తెలుసు.నేను అమ్మాయిని ఇష్టపడుతున్నానని నన్ను బాగా ఏడిపించేవారు.
మొత్తం ఏడాదిలో ఒకే ఒక్కసారి ఆమెతో మాట్లాడాను.అది కూడా చాలా కష్టం మీద మాట్లాడాను.
ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగాను అని రాజమౌళి నవ్వుతూ చెప్పుకొచ్చారు.ఆ మాటకు రానా( Rana ) పగలబడి నవ్వారు.రానా తో పాటు అక్కడ ఉన్న వారందరూ కూడా ఫుల్ గా నవ్వుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియో పై జక్కన్న అభిమానులు స్పందిస్తూ.వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కామెడీ లవ్ స్టోరీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి ఆ తర్వాత ఏం జరిగింది? జక్కన్న లవ్ స్టోరీ చివరికి ఏమైంది జక్కన్న ఏం చెప్పాడు.అన్న విషయాలు తెలియాలి అంటే ఈ ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.