టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక( Rashmika ) యానిమల్,( Animal ) పుష్ప2( Pushpa 2 ) సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.తాజాగా రష్మిక ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
సినిమా కథ ఆధారంగా సినిమాలో ఏ పాత్రను హైలెట్ చేయాలో ఆలోచిస్తారని రష్మిక అన్నారు.హీరో దృష్టి కోణంలో రాస్తే అతని పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.
హీరోయిన్ కోసం స్టోరీ రాస్తే ఆమె పాత్రను హైలెట్ చేయాల్సి ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చారు.పాత్రల స్వభావాలు సైతం స్టోరీ ఆధారంగా ఉంటాయని ఆమె అన్నారు.మనుషులందరిలో మంచి, చెడు గుణాలు ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు.మా అమ్మ ఎప్పుడూ ఒక విషయాన్ని చెబుతుందని రష్మిక వెల్లడించారు.
ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం వారి స్వభావం ఆధారంగా ఆధారపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
మనం పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీళ్లు అన్నీ ఒక్కటేనని కాకపోతే ఈగో వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం వస్తుందని రష్మిక వెల్లడించారు.అలాంటప్పుడు సినిమాల్లోని పాత్రలను నిందించడం తప్పు అని ఆమె తెలిపారు.పుష్పరాజ్ పాత్ర స్వభావాన్ని కాకుండా ఫ్యామిలీ కోసం పుష్పరాజ్( Pushparaj ) ఏం చేశాడో చూడాలని రష్మిక చెప్పుకొచ్చారు.
రియల్ లైఫ్ లో 200 మందిని చంపితే జైలులో ఉంటారని రష్మిక తెలిపారు.
అదే సన్నివేశాన్ని సినిమాలో చూపిస్తే ఎంజాయ్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.అలా వినోదాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే సినిమాలు భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయని రష్మిక చెప్పుకొచ్చారు.పుష్ప2 సినిమా ఇప్పటికే 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.పుష్ప ది రూల్ కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి.రష్మిక కొత్త ప్రాజెక్ట్స్ వివరాలు తెలియాల్సి ఉంది.