గత కొన్నేళ్లలో టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే.రాజమౌళి, సుకుమార్ తమ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు వినిపించేలా చేశారు.
రాజమౌళి( Rajamouli ) విజువల్ వండర్స్ తో మ్యాజిక్ చేయగా సుకుమార్( Sukumar ) సాధారణ మాస్ సినిమాతోనే అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్నారు.అయితే ప్రభాస్,( Prabhas ) బన్నీలలో( Bunny ) నంబర్ వన్ ఎవరనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
తర్వాత సినిమాల కలెక్షన్లను బట్టి ఈ ప్రశ్నకు జవాబు దొరకనుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ప్రభాస్, బన్నీలలో క్రేజ్ పరంగా ఎవరూ తక్కువ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నార్త్ బెల్ట్ లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ హీరోల సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి.పాజిటివ్ టాక్ వస్తే ఈ హీరోలు క్రియేట్ చేస్తున్న రికార్డులు మాత్రం అన్నీఇన్నీ కావు.

ప్రభాస్, బన్నీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.ఈ హీరోల తర్వాత సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ప్రభాస్, బన్నీ బ్యాక్ టు బ్యాక్స్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.ప్రభాస్, బన్నీ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్నారు.

ప్రభాస్, బన్నీ విభిన్నమైన ప్రాజెక్ట్ లకు ఓటేస్తున్నారు.వేర్వేరు జానర్ల సినిమాలలో నటిస్తుండటం కూడా ఈ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రభాస్ రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండగా బన్నీ పుష్ప ది రూల్( Pushpa The Rule ) కోసం ఏకంగా 235 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు.ప్రభాస్, బన్నీ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.