ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది దర్శకులు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా హీరోలు దర్శకులు మంచి కథతో సినిమా చేస్తే ఎవరికైనా ఇక్కడ సక్సెస్ వరిస్తుందనే రీతిలో కొంతమంది యంగ్ డైరెక్టర్స్, హీరోలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘క ‘ సినిమాతో( Ka Movie ) కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) మంచి విజయాన్ని సాధించాడు.
మరి ఆయనకు పాన్ ఇండియాలో అప్పటివరకు మార్కెట్ అయితే లేదు.కానీ ఆ సినిమాతో పాన్ ఇండియా లో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబడుతున్నాడు.

మరి ఇలాంటి హీరో ఇప్పుడు చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఇక తన తోటి హీరోలందరు ఒక సక్సెస్ ని కొట్టడానికి నానా తంటాలు పడుతుంటే మనోడు మాత్రం పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించి 50 కోట్లు మార్కును అందుకున్నారు.ఇక ఇప్పటికే తన సమకాలిన హీరోలతో పోటీ పడుతూ ఒక అడుగు ముందు వరుసలో ఉన్న ఈయన తన తదుపరి ఎలాంటి సినిమాలను చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది…

ఇక ఇప్పటికే ఆయనకు స్టార్ డైరెక్టర్లు కూడా కథలు వినిపించినట్టుగా తెలుస్తోంది.ఇక మహేష్ బాబు తో ‘సర్కార్ వారి పాట’ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేసి డిజాస్టర్ ని మూటగట్టుకున్న పరుశురామ్( Director Parasuram ) సైతం కిరణ్ అబ్బవరం తో ఒక సినిమా చేయడానికి ఆయనకు ఒక కథను అయితే వినిపించారట.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయాలు తెలియవు గానీ మొత్తానికైతే కిరణ్ అబ్బవరం స్టార్ హీరోగా ఎదిగాడని చెప్పడం లో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు…
.