మారుతున్న జీవన విధానం తీసుకుంటున్న ఆహార పదార్థాల మార్పుల కారణంగా అధిక రక్తపోటు సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరుగుతుంది.పూర్వం సమాజంలో 40 సంవత్సరాలు దాటిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపించేది.
కానీ ప్రస్తుత సమాజంలో 25 సంవత్సరాల వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంది.హైబీపీ కాలక్రమమేన గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
అయితే రక్తపోటు ను వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.అలాంటి కొన్ని ముందస్తు లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హైబీపీ( High BP ) కారణంగా శరీరంలో రక్త ప్రసరణ వేగం పెరుగుతుందని దాదాపు చాలా మందికి తెలుసు.ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండె కు రక్తాన్ని పంపించడానికి చాలా కష్టపడవలసి వస్తుంది.దీనికి కారణంగా సిరలలో ఒత్తిడి పెరుగుతుంది.ఇది గుండె ఆగిపోవడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే హై బీపీ ముందుగానే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా హై బీపీ ఉన్న వారిలో ఆకస్మిక చమట, గుండె కొట్టుకోవడంలో వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే మరికొన్ని లక్షణాల ద్వారా కూడా ఈ సమస్యను ముందుగా గుర్తించవచ్చు.ఇలాంటి లక్షణాలలో మొదటిది మైకంగా ఉండడం, కళ్లు చీకట్లు అయిన భావన, ఒక్కసారిగా నిస్సత్తువుగా ఉన్న హైబీపీ లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఉన్నఫలంగా చెమట రావడం, నిద్రలేమి సమస్య ( Insomnia problem )ఉన్న కూడా హైబీపీ లక్షణాలు అని చెబుతున్నారు.అలాగే కళ్లు ఎర్రబడడం, కళ్లలో రక్తపు మచ్చలు కనిపించిన హైబీపీ లక్షణాలే అని చెబుతున్నారు.
అయితే కొన్ని సందర్భాలలో షుగర్ వ్యాధి ఉన్నవారిలో కూడా కల్లు ఏర్పడడం గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు కళ్లు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.అలాగే అధిక బిపి ఉన్నవారు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు వ్యాయామం అలవాటు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.