జుట్టు రాలడం( hair loss ) అనేది అందరిలోనూ ఉంటుంది.కానీ కొందరిలో మాత్రం ఇది చాలా తీవ్రతరంగా ఉంటుంది.
ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్యం, పలు రకాల మందుల వాడకం, ఒత్తిడి, గంటలు తరబడి మొబైల్ ఫోన్ ను వాడటం, వేడి వేడి నీటితో తలస్నానం చేయడం తదితర కారణాల వల్ల కొందరిలో జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది.ఈ సమస్యతో మీరు బాధపడుతున్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను మీరు వాడాల్సిందే.
ఈ ఆయిల్ ఎంత తీవ్రమైన హెయిర్ ఫాల్ ను అయినా చాలా వేగంగా కంట్రోల్ చేస్తుంది.
అదే సమయంలో మరిన్ని బెనిఫిట్స్ ను అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.
ముందుగా ఒక ఉల్లిపాయ(
onion) తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు( Mustard), ఒక గ్లాస్ నువ్వుల నూనె (
Sesame oil )వేసుకుని చిన్న మంటపై కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు బాగా పట్టించి కాసేపు వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి.నైట్ ఆయిల్ ను అప్లై చేసుకుని మరుసటి రోజు తలస్నానం చేయాలి.

వారంలో కేవలం రెండు సార్లు ఆయిల్ ను కనుక వాడితే జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.దాంతో హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.ఈ ఆయిల్ ను వాడటం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.తెల్ల జుట్టు సమస్య త్వరగా దరి చేరకుండా ఉంటుంది.మరియు జుట్టు పట్టు కుచ్చులా మెరిసిపోతుంది.
కాబట్టి ఎవరైతే అధిక హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్నారో తప్పకుండా ఈ ఆయిల్ ను ప్రిపేర్ చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.