అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం ఒక్కో సినిమాకు 200 నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే అల్లు అర్జున్ కు బెయిల్ రావడం కోసం లాయర్ నిరంజన్ రెడ్డి( Lawyer Niranjan Reddy ) పని చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ లాయర్లలో లాయర్ నిరంజన్ రెడ్డి కూడా ఒకరు.సాధారణంగా ఆయన ఫీజు రోజుకు 8 నుంచి 10 లక్షల వరకు ఉంటుందని స్పెషల్ కేసులకు మాత్రం 30 లక్షల వరకు తీసుకుంటారని సమాచారం.
బన్నీ కేసుకు సైతం ఆయనకు 30 లక్షల రూపాయలు దక్కిందని తెలుస్తోంది.నిరంజన్ రెడ్డి పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది.మొత్తం ముగ్గురు న్యాయవాదులు ఈ కేసు కోసం పని చేయగా మిగతా న్యాయవాదుల ఫీజు మాత్రం తక్కువేనని తెలుస్తోంది.అయితే బన్నీని అరెస్ట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది అరెస్ట్ చేయడం రైట్ అని చెబుతుండగా మరి కొందరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు చేస్తున్నారు.బన్నీ బెయిల్ పై( Bunny Bail ) విడుదలైనా ఈ కేసు నుంచి పూర్తిస్థాయిలో ఉపశమనం లభించిందని చెప్పలేము.రేవతి భర్త భాస్కర్( Revathi Husband Bhaskar ) కేసును విత్ డ్రా చేసుకుంటే మాత్రమే ఈ కేసు నుంచి బన్నీ బయటపడే ఛాన్స్ ఉంది.మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం కూడా బన్నీకి ఒక విధంగా ప్లస్ అయింది.
అల్లు అర్జున్ పై ఈ ఏడాది ఏకంగా 3 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.ఇకపై బన్నీ తనపై కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి.నార్త్ బెల్ట్ లో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం బన్నీకి కెరీర్ పరంగా ఎంతో ప్లస్ అయిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.