ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ పడితే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.చాలామంది తమ రోజును కాఫీ తోనే( Coffee ) ప్రారంభిస్తుంటారు.
కాఫీ తాగకపోతే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది.పరిమితంగా తీసుకుంటే కాఫీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పలు నివేదికలు తేల్చాయి.
ఇక కాఫీ పౌడర్( Coffee Powder ) చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.అనేక బెనిఫిట్స్ ను అందిస్తుంది.
ముఖ్యంగా కాఫీ పౌడర్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మీ ముఖంలో కొత్త కాంతి వస్తుంది.చర్మం నిగారింపుగా మెరిసిపోతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం చర్మ సౌందర్యానికి కాఫీ పౌడర్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆరు నుంచి ఎనిమిది బాదం పప్పులు( Badam ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయం నానబెట్టుకున్న బాదం పప్పులను తొక్క తొలగించి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ బాదం పేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్,( Olive Oil ) మూడు టేబుల్ స్పూన్లు పాలు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి.వారంలో మూడు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం కాంతివంతంగా( Shiny Skin ) నిగారింపు గా మారుతుంది.
స్కిన్ టోన్ రెట్టింపు అవుతుంది.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.
ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.చర్మం టైట్ గా మారడమే కాదు బ్రైట్ గా సైతం మెరుస్తుంది.
ఈ రెమెడీని పాటిస్తే సహజంగానే మీరు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు.