1.మేఘా ఇంజినీరింగ్ సంస్థకు పీవీ రమేష్ రాజీనామా
మేఘా ఇంజినీరింగ్ సంస్థ బాధ్యతల నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తప్పుకున్నారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి కి పంపారు.
2.జగన్ కీలక సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ కీలక నేతలు, ఉన్నాతాథికారుల తో ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు.
3.బాలకృష్ణ కామెంట్స్
ఎలాంటి ఆధారాలు లేకుండా, కక్ష సాధింపు తోనే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ను అరెస్ట్ చేశారని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు.నేనొస్తున్నా అని , ఎవరూ భయపదనవసరం లేదని బాలకృష్ణ అన్నారు.
4.చంద్రబాబు అరెస్ట్ పై హై కోర్టు లో పిటిషన్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ అక్రమం అని, మాజీ అడ్వకేట్ జనరల్ , సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ ఏపీ హై కోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
5.అచ్చెన్న కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది మరణించడం బాధాకరం అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
6.చంద్రబాబు అరెస్టుపై కిషన్ రెడ్డి కామెంట్స్

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ విషయం తన దృష్టికి వచ్చిందని, ముందస్తు నోటీసు లేకుండా ఆయన అరెస్ట్ జరిగినట్టు తెలిసిందని కిషన్ రెడ్డి అన్నారు.
7.ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా : పొంగులేటి
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్ నియోజకవర్గాల్లో ఎక్కడ నుంచి అయినా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఖమ్మం మాజీ ఎంపీ , కాంగ్రెస్ నేత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
8.తిరుమల నడక మార్గంలో.

తిరుమలలో నడక ఘాట్ రోడ్లలో ఆంక్షలు కొనసాగుతాయని సీ సీ ఎఫ్ మధుసుధన్ రెడ్డి అన్నారు.
9.మాజీమంత్రి ప్రత్తిపాటి తో సహా 89 మంది పై కేసు నమోదు
మాజీ మంత్రి ,టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు, ఆయన అనుచరులు 89 మందిపై చిలకలూరి పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది.చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రోడ్డుపై గుమిగూడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం పై ఈ కేసు నమోదు అయ్యింది.
10.చంద్రబాబు ను కలవనున్న కుటుంబ సభ్యులు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ను కలిసేందుకు కుటుంబ సభ్యుల ములాఖత్ కు అనుమతి తీసుకున్నారు.చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి లు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ములాఖత్ కానున్నారు.
11.సంక్రాంతి రైలు టికెట్ల రిజర్వేషన్
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రైలు టికెట్ల ముందస్తు రిజర్వేషన్ ఈ నెల 13 న బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
12.ఊటికీ ప్రత్యేక రైలు

ఈ నెల 17 నుంచి మళ్లీ ఊటికి ప్రత్యేక రైలు నడపనున్నారు.కోయంబత్తూర్ జిల్లా మెట్టు పాళయం నుంచి నీలగిరి జిల్లా ఊటి మధ్య రైలు ప్రయాణం సాగుతుంది.
13. తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021 సంవత్సరానికి గాను కీర్తి పురస్కారాల ను ప్రదానం చేసింది.తెలుగు సాహిత్యంలో వివిధ విభాగాల్లో సేవలందించిన 23 మంది ప్రముఖులకు పురస్కారాలను అందజేశారు.
14.విషమంగా డీ ఎస్ ఆరోగ్యం

పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమించింది.ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
15.తెలంగాణ సమైక్యతా దినోత్సవం
ఈ నెల 17 న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
16.సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై లేబర్ కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చింది.ఈ నెల 22 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్దమవుతోంది.
17.షర్మిల కామెంట్స్
రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన శక్తులు మీరేనని బీఆర్ ఎస్ నేతలను ఉద్దేశించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు.
18.భట్టి విక్రమార్క విమర్శలు

కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పులపాలైందని సీ ఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
19.మంత్రి అజయ్ కు రేణుకా చౌదరి సవాల్
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సవాల్ విసిరారు.ఖబడ్దార్ అజయ్ కుమార్ దమ్ముంటే రా అంటూ రేణుకా చౌదరి సవాల్ విసిరారు.
20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 54,840
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 59,830
.