అల్లు అర్జున్( Allu Arjun ) కు కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో పోలీసులు తనని చంచల్ గూడా జైలుకు తరలించారు.ఇలా జైలుకు వెళ్లిన తర్వాత కోర్టులో ఈయనకు మధ్యంతర బెయిల్ సంపాదించి అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు.
అయితే కోర్టులో అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి( Lawyer Niranjan Reddy ) చాలా ఫైట్ చేసి తనకు బెయిల్ సంపాదించారని తెలుస్తుంది.
ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో నిరంజన్ రెడ్డి కీలక విషయాలను జడ్జి ముందు ఉంచినట్టు సమాచారం.
రిమాండ్ విధించిన తర్వాత క్వాష్ పిటిషన్‌లో బెయిల్ ఇవ్వరు.హైకోర్టు తన విచక్షణ అధికారంతో అల్లు అర్జున్ కి బెయిల్( Allu Arjun Bail ) మంజూరు చేసింది.
అర్నబ్ గోస్వామి కేసుని మెన్షన్ చేస్తూ.బెయిల్ సంపాదించడంలో నిరంజన్ రెడ్డి సక్సెస్ అయ్యారు.
ఇక షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) సినీ ప్రమోషన్లలో భాగంగా ఒక అభిమాని చనిపోతే ఆయనపై కేసు నమోదు అయిన గుజరాత్ కోర్టు ఆ కేసును కొట్టి వేసినట్టు ఈయన గుర్తు చేశారు.
ఈ విధంగా నిరంజన్ రెడ్డి బలమైన వాదనలు వినిపించడంతో కోర్టు కూడా ఈయనకు బెయిల్ మంజూరు చేసిన దీంతో నిరంజన్ రెడ్డి ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఈయన సినీ నిర్మాత మాత్రమే కాకుండా వైసీపీ ఎంపీ కూడా కావటం విశేషం ఈయన జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) కి వ్యక్తిగత లాయర్ కూడా కావటం విశేషం ఇలా వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న నిరంజన్ రెడ్డి సినీ ఇండస్ట్రీలో కూడా నిర్మాతగా( Producer ) పలు సినిమాలు చేశారు.
ఇక చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకి నిర్మాతగా కూడా నిరంజన్ రెడ్డి వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇలా అల్లు అర్జున్ కేసును వాదించడంతో నిరంజన్ రెడ్డి తీసుకున్న ఫీజు గురించి కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.సాధారణంగా గంటసేపు వాదిస్తే 5 లక్షల రూపాయల వరకు ఫీజు తీసుకునే నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో మాత్రం గంటకు 10 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం.
ఇకపై అల్లు అర్జున్ కేసును కూడా నిరంజన్ రెడ్డి టేకప్ చేశారు కనుక ఈయనకు ఫీజు భారీ మొత్తంలోనే అందుతుందని తెలుస్తుంది.