జుట్టు రాలే సమస్యతో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టేయండి..!

జుట్టు రాలడం( hair loss ) అనేది ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతోమందికి అతిపెద్ద సమస్యగా మారిపోయింది.హెయిర్ ఫాల్ అవ్వడానికి అందరిలోనూ ఒకే రకమైన కారణాలు ఉండకపోవచ్చు.

 Try This Powerful Tonic Will Stop Hair Fall! Stop Hair Fall, Hair Fall, Hair Car-TeluguStop.com

కానీ సరైన కేర్ తీసుకుంటే సులభంగా సమస్య నుంచి బయటపడవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ హెయిర్ టానిక్ అందుకు చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.

ఈ టానిక్ తో జుట్టు రాలే సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు.

అందుకోసం ముందుగా ఒక ఉల్లిపాయను( onion ) తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే అంగుళం అల్లం ముక్కను( ginger ) కూడా తీసుకుని తొక్క చెక్కేసి ముక్కలుగా కట్ చేయాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె( Mustard oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మన టానిక్ అనేది రెడీ అవుతుంది.

Telugu Care, Care Tips, Fall, Tonic, Healthy, Powerful Tonic, Powerfultonic-Telu

ఒక స్ప్రే బాటిల్( Spray bottle ) లో తయారు చేసుకున్న టానిక్ నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.ఆపై కనీసం ఐదు నిమిషాల పాటు తలను మసాజ్ చేసుకోవాలి.గంట లేదా రెండు గంటలు అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే జుట్టు మూలల నుంచి దృఢంగా ఆరోగ్యంగా మారుతుంది.

జుట్టు రాలే సమస్య తగ్గు ముఖపడుతుంది.

Telugu Care, Care Tips, Fall, Tonic, Healthy, Powerful Tonic, Powerfultonic-Telu

అదే సమయంలో రక్త ప్రసరణ మెరుగుపడి హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది.అంటే ఈ టానిక్ ను వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గ‌డ‌మే కాదు కురులు ఒత్తుగా ఆరోగ్యంగా కూడా పెరుగుతాయి.అంతేకాకుండా ఉల్లిపాయ మరియు అల్లం లో ఉండే పలు స‌మ్మేళ‌నాలు చుండ్రుకు వ్యతిరేకంగా పోరాడతాయి.

చుండ్రు సమస్యను నివారించి స్కాల్ప్ ఆరోగ్యాన్ని పోషిస్తాయి.కాబట్టి జుట్టు రాలే సమస్యతో వర్రీ అవుతున్న వారు తప్పకుండా ఈ టానిక్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube